Thursday, March 28, 2024

శ్రీదేవి సోడా సెంటర్@ ప్రభాస్ సపోర్ట్

సుధీర్ బాబు హీరోగా ఆనంది హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం శ్రీదేవి సోడా సెంటర్. కరుణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఆగస్ట్ 27న రిలీజ్ కాబోతుంది. ఇక ఇప్పటికే ఈ మూవీ ప్రమోషన్స్ లో అగ్ర కథానాయకులు పాలు పంచుకోగా… ఇప్పుడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సైతం తనవంతు సాయం అందించాడు.

ఈ సినిమా హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్స్ ను ప్రభాస్ ఇంటర్వ్యూ చేసి మూవీపై అంచనాలు పెంచారు. దీనికి సంబంధించిన పూర్తి ఇంటర్వూ బుధవారం రానుంది. మరోవైపు శ్రీదేవి సోడాసెంటర్ మూవీ సెన్సార్ కార్యక్రమాలనూ పూర్తి చేసుకుంది. కట్స్ ఏమీ లేకుండానే మూవీకి సెన్సార్ సభ్యులు యు/ఎ సర్టిఫికెట్ ను ఇచ్చారని, రన్ టైమ్ 2 గంటల 34 నిమిషాలుగా లాక్ చేశామని చిత్ర యూనిట్ తెలిపింది. మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement