Sunday, May 5, 2024

యశోద‌లో డూప్ లేకుండా – స‌మంత యాక్ష‌న్ సీన్స్

య‌శోద చిత్రంలో హీరోయిన్ స‌మంత డూప్ లేకుండా యాక్ష‌న్ సీన్స్ లో న‌టించింద‌ని ద‌ర్శ‌కులు హ‌రిశంక‌ర్..హ‌రీశ్ నారాయ‌ణ్ తెలిపారు.య‌శోద‌లో యాక్ష‌న్ సీన్ల‌ను హాలీవుడ్ యాక్ష‌న్ డైరెక్ట‌ర్ యానిక్ బెన్‌, టాలీవుడ్‌కు చెందిన వెంక‌ట్ మాస్ట‌ర్ డిజైన్ చేశారు. శ్రీ‌దేవి మూవీస్ బ్యాన‌ర్‌పై సీనియ‌ర్ ప్రొడ్యూస‌ర్ శివ‌లెంక కృష్ణ‌ప్ర‌సాద్ నిర్మించిన ఈ సినిమాతో దర్శ‌క ద్వ‌యం హ‌రి శంక‌ర్‌, హ‌రీశ్ నారాయ‌ణ్ తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. య‌శోద చిత్రం కోసం బాగా ప‌ర్ఫామ్ చేయ‌గ‌లిగిన స్టార్ యాక్ట్రెస్ కావాల‌ని అనుకున్న‌ప్పుడు వారి మొట్ట‌మొద‌టి ఛాయిస్ స‌మంత‌నేన‌ట‌.

అదృష్ట‌వ‌శాత్తూ మొద‌టిసారి క‌లిసి క‌థ వినిపించిన వెంట‌నే ఆమె య‌స్ చెప్పేసిందన్నారు. క‌థ చెప్ప‌డం పూర్త‌య్యాక‌, స‌మంత స‌రిగ్గా ఏమందంటే..నాకు గూస్‌బంప్స్ వ‌స్తున్నాయి. ఈ సినిమా చెయ్యాల‌నుకుంటున్నాను అని. ‘ద ఫ్యామిలీ మ్యాన్ 2’ కంటే ముందుగానే మేం ‘య‌శోద’ కోసం సామ్‌ను సంప్ర‌దించాం అని వారు చెప్పారు. యాక్ష‌న్ సీన్స్‌కు ఎవ‌రి సాయ‌మైనా తీసుకోవ‌డానికి సామ్ తిర‌స్క‌రించింద‌ని కూడా హ‌రి-హ‌రీశ్ చెప్పారు. యాక్ష‌న్ సీక్వెన్స్‌ల‌లో ఎక్కువ భాగం సెట్స్‌లోనే తీశాం. ఫైట్ సీక్వెన్స్ అన్నీ తానే స్వ‌యంగా చేయాల‌నుకున్న ఆమె, అవి తీసే ముందు రెండు మూడు రోజులు రిహార్స‌ల్స్ చేసేది. బాడీ డ‌బుల్ (డూప్‌)కు ఆమె ఏమాత్రం ఒప్పుకోలేదు. కొన్ని సీన్ల‌లో సేఫ్టీ కోసం రోప్ అవ‌స‌ర‌మైన‌ప్పుడు, వాటిని కూడా స‌మంత‌ స్వ‌యంగా చేసింది. అవి చేసేట‌ప్పుడు త‌ను బాగా ఎంజాయ్ చేసింద‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement