Saturday, May 4, 2024

గంగోత్రి, య‌మునోత్రి, కేదార్‌నాథ్ యాత్ర ప్రారంభం

YAMUNOTRI, GANGOTRI, KEDATNATH: ఉత్త‌రాఖండ్‌లో 3 రోజుల పాటు భారీ వ‌ర్షాలు కురిసిన విష‌యం తెలిసిందే. దీంతో ఆ రాష్ట్రంలో చార్‌ధామ్ యాత్ర‌ను తాత్కాలికంగా నిలిపేశారు. అయితే ఇవాళ్టి నుంచి య‌మునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్ ఆల‌యాల‌ను తెర‌వ‌నున్న‌ట్లు ఉత్త‌రాఖండ్ పోలీసులు త‌మ ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు. జోషీమఠం వ‌ద్ద బద్రీనాథ్ హైవేను మూసివేయ‌డం వ‌ల్ల.. ఇప్పుడే బ‌ద్రీనాథ్ యాత్ర‌ను ప్రారంభించ‌డం లేద‌న్నారు. త్వ‌ర‌లోనే ఈ యాత్ర‌ను కూడా ప్రారంభిస్తామ‌ని తెలిపారు.

మ‌రోవైపు ఇవాళ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా.. ఉత్త‌రాఖండ్‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. అక్క‌డి ప‌రిస్థితుల‌ను ఆయ‌న స‌మీక్షించ‌నున్నారు. వ‌రుస వ‌ర్షాల వ‌ల్ల ఆ రాష్ట్రంలో సుమారు 50మందికి పైగా చ‌నిపోయిన‌ విష‌యం తెలిసిందే. సుంద‌ర నైనిటాల్ న‌గ‌రం.. వాన‌లు, వ‌ర‌ధ ధాటికి తీవ్రంగా న‌ష్ట‌పోయింది. నైనీ స‌ర‌స్సు ఉప్పొంగ‌డంతో.. న‌గ‌రమంతా అస్త‌వ్య‌స్త‌మైంది. ఆ రాష్ట్ర సీఎం పుష్క‌ర్ సింగ్ థామితో.. కేంద్ర మంత్రి స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించ‌నున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement