Monday, April 29, 2024

యమహా R3 అడ్వాన్స్‌ బుకింగ్ ప్రారంభం..

ప్రపంచ దేశాలతో పాటు ఇండియన్ మార్కెట్ లో కూడా సూపర్ పాపులారిటీనీ సంపాదించుకున్నాయి యమహా బైక్స్. ఈ జపనీస్ కంపెనీ హై-క్వాలిటీని మార్కెట్ లో రిలీజ్ చేస్తూ ఎప్పుడూ ఆకట్టుకుంటూనే ఉంటుంది. ఈ కంపెనీ నుంచి రిలీజ్ అయ్యే స్పోర్టీ, అగ్రెసివ్ బైక్స్‌కి ఇండియాలో చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. అయితే వారందరికీ కంపెనీ త్వరలోనే ఒక గుడ్ న్యూస్ చెప్పనుందని తెలుస్తోంది. ఈ కంపెనీ నుంచి యమహా ఆర్3 బైక్‌ మరికొద్ది రోజుల్లో ఇండియన్ మార్కెట్ లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం ఎంపిక చేసిన భారతీయ డీలర్‌షిప్‌లు Yamaha R3 కోసం బుకింగ్స్ ప్రారంభించాయి. ఈ బైక్ ఇంకా రిలీజ్ కాలేదు.. ఫీషియల్ లాంచ్‌కు ముందే దీని బుకింగ్స్ ప్రారంభమయ్యాయి.

కాగా ఆసక్తిగల కస్టమర్లు ఈ డీలర్‌షిప్‌ల వద్ద రూ.5,000 డిపాజిట్ చెల్లించి బైక్‌ను ఇప్పుడే అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవచ్చు. R3 బైక్ డెలివరీలు జులై చివరిలో లేదా ఆగస్టు మొదటి వారాల నుంచి ప్రారంభం కావచ్చు. ఏప్రిల్ నెల ప్రారంభంలో డీలర్‌షిప్‌ల కోసం ఒక ప్రైవేట్ ఈవెంట్‌లో తమ R3 మోటార్‌సైకిల్‌ను యమహా ప్రదర్శించింది. మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇది కవాసాకీ నింజా 300, 400, KTM RC 390లతో పోటీపడుతుంది.

యమహా ఆర్3 పవర్ & టార్క్

- Advertisement -

యమహా ఆర్3 బైక్ స్మూత్ 321cc ట్విన్-సిలిండర్ ఇంజన్‌తో 10,750rpm వద్ద 42hp పవర్, 9,000rpm వద్ద 29.5Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది SD ఫోర్క్, లింక్డ్ మోనోషాక్ సస్పెన్షన్ సెటప్‌తో వస్తుంది. ఈ పవర్‌ఫుల్ బైక్‌ను కంట్రోల్ చేయడానికి ముందువైపు 298ఎమ్ఎమ్ డిస్క్ బ్రేక్, వెనుక వైపు 202ఎమ్ఎమ్ డిస్క్ బ్రేక్ ఆఫర్ చేశారు. R3 భారతదేశంలో చివరిసారిగా 2019లో అమ్మకానికి అందుబాటులోకి వచ్చింది. ఈ నెల ఈవెంట్‌లో చూపించిన R3 వెర్షన్ 2023-స్పెక్ మోడల్‌ అని తెలుస్తోంది. యమహా బైక్ కంప్లీట్ బిల్ట్ అప్ (CBU) దిగుమతి అవుతోంది కాబట్టి అది దాని సెగ్మెంట్‌లో ఎక్కువ ధర ఉండే అవకాశం ఉంది. EU-స్పెక్ యమహా R3 బైక్స్‌నే కంపెనీ ఇండియాలో లాంచ్ చేసే అవకాశం ఉందని రిపోర్ట్స్ పేర్కొంటున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement