Sunday, April 28, 2024

రంజన్ గొగోయ్‌కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్

రాజ్యసభ సభ్యుడిగా సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్‌ను నియమించడాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది. ఈ రిట్ పిటిషన్‌లో రంజన్ గొగోయ్ నియామకంపై పిటిషనర్ పలు ప్రశ్నలు సంధించారు. గొగోయ్‌ను రాజ్యసభ సభ్యుడిగా నియమించేందుకు ఎలాంటి అర్హత, అధికారాలు ఉన్నాయని నిలదీశాడు. తన ప్రశ్నలకు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కౌన్సిల్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

కాగా అయోధ్యలో రామమందిరం సహా పలు కీలక తీర్పులను వెలువరించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ ప్రస్తుతం రాజ్యసభ సభ్యునిగా కొనసాగుతున్నారు. అయితే రాజ్యసభ సభ్యుడిగా తాను ఎలాంటి జీతభత్యాలు తీసుకోవడం లేదని గతంలో రంజన్ గొగోయ్ స్పష్టం చేశారు.

ఈ వార్త కూడా చదవండి: అమెరికాను అధిగమించిన భారత్.. ఏ విషయంలో అంటే?

Advertisement

తాజా వార్తలు

Advertisement