Sunday, April 21, 2024

శంకర్, చరణ్ సినిమాలో మరో సీనియర్ నటుడు ?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఆర్ ఆర్ ఆర్, అలాగే ఆచార్య సినిమాలు రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. అయితే వీటితో పాటు సంచలన దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు రామ్ చరణ్. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా చేశారు. భారీ బడ్జెట్ తో దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాను అనౌన్స్ చేసినప్పటి నుంచి కూడా అంచనాలు అంతకంతకూ ఎక్కువవుతూ వచ్చాయి. అలాగే ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా…. ప్రముఖ రచయిత సాయిమాధవ్ బుర్రా మాటలు అందిస్తున్నారు.

ఇదిలా ఉండగా తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ప్రముఖ నటుడు జయరామ్ కీలక పాత్రలో కనిపించనున్నాడని తెలుస్తుంది. గతంలో భాగమతి, అల వైకుంఠపురములో సినిమాలలో నటించారు జయరామ్. ఈ రెండు సినిమాలు కూడా మంచి హిట్ సాధించాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement