Saturday, May 18, 2024

25 నుండి ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ రెజ్లింగ్ ట్రయల్స్..

ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌ల కోసం ఈ నెల (ఆగస్టు) 25-26 తేదీలలో ట్రయల్స్ నిర్వ‌హించ‌నున్న‌ట్టు.. ఈ ట్ర‌య‌ల్స్ పాటియాలాలో జరుగుతాయని తాత్కాలికంగా ఉన్న‌ ప్యానెల్ సోమవారం ప్రకటించింది.

ట్రయల్స్ క్రింది వర్గాలలో నిర్వహించబడతాయి..

ఫ్రీ స్టైయిల్ : 57 కేజీలు, 61 కేజీలు, 65 కేజీలు, 70 కేజీలు, 74 కేజీలు, 79 కేజీలు, 86 కేజీలు, 92 కేజీలు, 97 కేజీలు, 125 కేజీలు.
గ్రీకో-రోమన్ : 55kg, 60kg, 63kg, 67kg, 72kg, 77kg, 82kg, 87kg, 97kg, 130kg.
మహిళల రెజ్లింగ్: 50kg, 53kg, 55Kgk, 57Kgk, 59Kgk, 62Kgk, 65Kgk, 68Kg, 72kg& 76kg.”

ట్రయల్స్ ఫార్మాట్

వెయిట్ కేటగిరీలో ఎనిమిది మంది కంటే తక్కువ రెజ్లర్లు ట్రయల్స్‌కు అర్హులైతే.. నార్డిక్ విధానాన్ని వర్తింపజేస్తామని తాత్కాలిక ప్యానెల్ తెలిపింది. నార్డిక్ విధానంలో, రెజ్లర్లు రౌండ్-రాబిన్ ఫార్మాట్‌లో ఒకరితో ఒకరు పోరాడుతారు. మ్యాచ్‌లు ముగిసిన తర్వాత.. విజయాల సంఖ్యను బట్టి రెజ్లర్లకు ర్యాంకులు ఇస్తారు.

వెయిట్ కేటగిరీలో ఎనిమిది లేదా అంతకంటే ఎక్కువ మంది రెజ్లర్లు అర్హత సాధిస్తే.. డైరెక్ట్ ఎలిమినేషన్ ఫార్మాట్ నిర్వహించబడుతుంది” అని తాత్కాలిక ప్యానెల్ ప్రకటన తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement