Sunday, April 28, 2024

ఆ దుర్మార్గున్ని అరెస్ట్ చేశారు..

తమిళనాడులోని చెన్నైలో ఓ కిరాతకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిత్య చిన్నారులపై లైంగిక దాడికి పాల్పడే నీచుడ్ని ఎట్టకేలకు తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు. చిన్నారులపై లైంగిక దాడికి పాల్పడి వాటిని తన మొబైల్లో చిత్రీకరించేవిడు పెరుమాళ్. ఇటీవల ఐదుగురు చిన్నారులపై పాశవికంగా లైంగికదాడికి పాల్పడి, తన కామవాంఛ తీర్చుకుంటున్నాడు నిందితుడు పెరుమాళ్. నిందితునితో పాటు అతనికి సహకరించిన ఇద్దరు చిన్నారుల తల్లులను సైతం అరెస్టు చేసారు చెన్నై పోలీసులు. బాధిత చిన్నారులను ప్రభుత్వ పరిశీలనా గృహానికి తరలించారు పోలీసులు. చెన్నై నగరంలో ఓ చిన్న చౌక దుకాణాన్ని నడుపుతున్నాడు పెరుమాళ్. అయితే గుట్కా విక్రయిస్తున్నాడన్న అనుమానంతో పెరుమాళ్ దుకాణంపై దాడి చేసిన పోలీసులు… కొన్ని ఆధారాల కోసం పెరుమాళ్ మొబైల్ ఫోన్ ను పరిశీలించగా చిన్నారులపై లైంగిక దాడి దృశ్యాలు బయటపడ్డాయి. పెరుమాళ్ మొబైల్ ఫోన్లో 50కి పైగా అశ్లీల దృశ్యాలు ఉండటంతో నివ్వెర పోయారు పోలీసులు.

ఇది కూడా చదవండి: ‘ఈనాడు’కు కార్టూనిస్ట్ శ్రీధర్ రాజీనామా

Advertisement

తాజా వార్తలు

Advertisement