Friday, May 3, 2024

పోలీస్ స్టేషన్ లో మహిళ ఆత్మహత్య యత్నం.. కుటుంబ క‌ల‌హాలే కార‌ణం

వాజేడు (ప్రభ న్యూస్) : ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని ధర్మవరం గ్రామానికి చెందిన కుదురుపాక స్రవంతి అనే పేరూరు పోలీస్ స్టేషన్ లో ఎస్సై ఎదుట శానిటైజర్ తాగి ఆత్మహత్యయత్నానికి పాల్ప‌డింది. బాధితురాలు స్రవంతి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ధర్మవరం గ్రామానికి చెందిన స్రవంతి, కుదురుపాక మోహన్ రావుతో 2019లో వివాహమైంది. వీరికి 16నెలల బాలుడు ఉన్నాడు. మోహన్ రావుతో పాటు అత‌ని సోద‌రుడు జనార్దన్ వేధింపుల వల్ల అబ్బాయి చనిపోయాడని, వేధింపులకు గురి చేస్తూ ఊడయించాలని చూస్తున్నాడని స్రవంతి పేరూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.

స్రవంతి ఫిర్యాదు మేరకు ఎస్సై రమేష్ పోలీస్ స్టేషన్ కు పిలిపించి విచారిస్తుండగా, తమకు న్యాయం చేయకుండా బాధించిన వారి వైపే పోలీసులు మాట్లాడుతున్నారని శుక్రవారం మద్యాహ్నాం పోలీస్ స్టేషన్ లో శానిటైజర్ తాగి అత్మహత్యకు పాల్పడింది. స్థానిక పేరూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం ఏటూర్ నాగారం ప్రభుత్వ వైద్యశాల తరలించారు. ఈ విషయంపై ఎస్సై రమేష్ ను ఆంధ్రప్రభ ఫోన్లో వివరణ కోరగా.. విచారిస్తుండగా శానిటైజర్ తాగి ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించిన స్రవంతిని వైద్యశాలకు తరలించి వైద్యం అందించడం జరిగిందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement