Monday, April 29, 2024

Delhi | జమిలికి మేం వ్యతిరేకం.. వన్ నేషన్, వన్ పర్సన్ కోసమే ఈ రాగం: సీపీఐ నారాయణ

ప్రభుత్వ అవినీతి బయటపడకుండా జీ-20 సమావేశాలను ఉపయోగించుకుంటున్నారని, చంద్రయాన్-3 ల్యాండర్ దిగిన ప్రదేశానికి ‘శివశక్తి’ అని పేరు పెట్టి మతాన్ని వాడుకుంటున్నారని నారాయణ ధ్వజమెత్తారు. దేశంలో మణిపూర్ సహా అనేక రాష్ట్రాల్లో పరిస్థితి దారుణంగా ఉన్నాయని, అక్కడ జమ్ము-కాశ్మీర్ తరహాలో ప్రత్యేక దేశం డిమాండ్ ఉందని నారాయణ గుర్తుచేశారు.

మణిపూర్‌లో బీజేపీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరారని, అక్కడ డబులింజన్ సర్కార్ పడిపోతుందని, ప్రతిపక్షాలు బలపడుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోందని, వాటి నుంచి దృష్టి మళ్లించడం కోసమే జమిలి ఎన్నికల ప్రతిపాదన తెరపైకి తెచ్చిందని అన్నారు. రామ్‍‌‌నాథ్ కోవింద్‌ను ముందు పెట్టాల్సిన అవసరం ఏముందని నారాయణ ప్రశ్నించారు. బీజేపీకి స్వాతంత్ర్య పోరాటంతో సంబంధం లేదని, ఈ దేశం ఎలా పుట్టిందో తెలిస్తే అప్పుడు జమిలి ఎన్నికల గురించి మాట్లాడాలని నారాయణ సూచించారు. దేశాన్ని ముక్కలు చేసేలా బీజేపీ విధానాలున్నాయని మండిపడ్డారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement