Saturday, April 27, 2024

మ‌ద్యం అమ్ముతోన్న క‌మెడియ‌న్ ర‌ఘు .. కార‌ణ‌మేంటో తెలుసా ..

మ‌ద్యం అమ్ముతూ క‌నిపించాడు స్టార్ క‌మెడియ‌న్ , యాక్ట‌ర్ ర‌ఘు..జ‌బ‌ర్థ‌స్త్ షో లో క‌మెడియ‌న్ గా న‌టించారు. రోల‌ర్ ర‌ఘు పేరుతో టీం లీడ‌ర్ గా చేశారు. ఆ షో నుండి బ‌య‌టికి వ‌చ్చి ప‌లు చిత్రాల్లో న‌టించారు. కాగా ఆయ‌న కెరీర్ నిలక‌డ‌గా లేక‌పోవ‌డంతో వ్యాపారం వైపు అడుగులు వేశారు. కెరీర్ నిలకడగా లేకపోవడంతో ఆయన వ్యాపారం వైపు అడుగులు వేశారు. లిక్కర్ వైన్స్ వ్యాపారంలోకి అడుగు పెట్టాడు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన మద్యం దుకాణాల వేలంలో పాల్గొన్న రఘు.. నల్లగొండ పట్టణ శివారులోని మర్రిగూడ బైపాస్‌ పక్కనున్న అభినవ్ 1 & 2 దుకాణాలను చేజిక్కించుకున్నట్లు తెలిసింది.

నేటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా ఇటీవల మద్యం దుకాణాలు దక్కించుకున్న నిర్వాహకులు.. అమ్మకాలను ప్రారంభించారు. ఇందులో భాగంగానే కమెడియన్ రఘు తనకు వచ్చిన మద్యం దుకాణాల ముందు పూజలు నిర్వహించి.. కాసేపు కౌంటర్లు నిలబడి మద్యం అమ్మాడు. తన మిత్రులతో కలిసి వేసిన మద్యం సిండికేట్ లో రెండు వైన్స్ షాపులను సొంతం చేసుకున్నాడు. కాగా.. మద్యం దుకాణాల టెండర్లలో ఈసారి చాలామంది కొత్త వాళ్లకు షాపులు దక్కాయి. కాగా ఆదిలాంటి మొదటి సినిమాతోనే మంచి పాపులారిటీ తెచ్చుకోగా… దిల్, యోగి, అదుర్స్ వంటి చిత్రాలలో నటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement