Friday, May 17, 2024

ఖాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి మోక్షమెప్పుడు..? రాజ్యసభలో ప్రశ్నించిన ఎంపీ వద్దిరాజు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఖాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ విషయంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలను కేంద్ర ప్రభుత్వం గౌరవించాలని టీఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ప్రశ్నోత్తరాల సమయంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర రైల్వే సంబంధిత అంశాలపై కేంద్రాన్ని ప్రశ్నించారు. ఖాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీతో పాటు తెలంగాణలో రైల్వేస్టేషన్ల పునరుద్ధరణ కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలన్నారు. పునర్విభజన చట్టంలో పొందుపరిచిన ఖాజీపేట ఫ్యాక్టరీపై ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రానికి పలుమార్లు విజ్ఞప్తి చేశారని ఆయన గుర్తు చేశారు.

చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ సమస్యపై స్పందించాలని డిమాండ్ చేయగా… రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ సమాధానాన్ని దాటవేశారని రవిచంద్ర చెప్పుకొచ్చారు. ఖాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అంశం తెలంగాణ ప్రజల మనోభావాలతో ముడిపడి ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం, ఇక్కడి ప్రజల పట్ల కేంద్రానికి ఏ మాత్రం చిత్తశుద్ధి లేద విమర్శించారు. ఎంపీలు అడిగిన ప్రశ్నలకు కూడా జవాబివ్వట్లేదని ఆరోపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement