Thursday, May 2, 2024

స్వగృహ ఫ్లాట్ల కేటాయింపునకు వేళాయే.. రేప‌టినుంచి కేటాయింపులు షురూ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: హైదరాబాద్‌ బండ్లగూడ, పోచారంలోని రాజీవ్‌ స్వగృహ అపార్ట్‌మెంట్ల ఫ్లాట్ల కేటాయింపును నేటి నుంచి మూడు రోజుల పాటు చేపట్టనున్నారు. ఈ రోజు, రేపు, ఎల్లుండి లాటరీ తీయనున్నారు. ఈరోజు పోచారం, 28న బండ్లగూడ (త్రిబుల్‌ బెడ్‌ రూమ్‌ డీలక్స్‌ మినహా), 29న బండ్ల గూడ త్రిబుల్‌ బెడ్‌ రూమ్‌ డీలక్స్‌ ఫ్లాట్లకు లాటరీ తీయనున్నారు. మొత్తం 3716 ఫ్లాట్లకు 39082 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో బండ్లగూడకే 33,161 దరఖాస్తులు వచ్చాయి. బండ్లగూడలోని ఫ్లాట్లకు వినియోగదారుల నుంచి తీవ్ర పోటీ ఉంది. అయితే ఈ ప్లాట్లను లాటరీ ద్వారా వినియోగదారులను హెచ్‌ఎండీఏ కేటాయించనుంది. లాటరీని యూట్యూబ్‌, ఫేస్‌బుక్‌లో లైవ్‌ టెలీకాస్ట్‌ చేయనున్నారు.

టరీ తీసిన తర్వాత ఫ్లాట్‌ నంబర్‌, దరఖాస్తుదారుడి పేరు వెల్లడిస్తామని తెలిపింది. బండ్లగూడలో 345 త్రిబుల్‌ బెడ్‌ రూమ్‌ డీలక్స్‌ ఫ్లాట్లకు 16,679 దరఖాస్తులు రావడంతో ఈ ఫ్లాట్లకు లాటరీని ఈనెల 29న తీయనున్నారు. ఒక వ్యక్తి ఒకే ఫ్లాట్‌కు అర్హులని, ఒక వేళ రెండు ఫ్లాట్లు పొందితే వాటిని రద్దు చేస్తామని హెచ్‌ఎఓండిఏ తెలిపింది. ఫ్లాట్‌ను దక్కించుకున్న వ్యక్తులు 10 శాతం డబ్బును వారంలోగా, 80 శాతం డబ్బును రెండు నెల్లలోగా, మిగతా 10 శాతంను మూడు నెల్లోగా చెల్లించాలని ప్రకటించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement