Monday, April 29, 2024

గర్ల్​ఫ్రెండ్ ​తోనే రామ్​ మ్యారేజీ.. ఇయ్యాల్నో, రేపో అందరికీ చెప్పేస్తడట!

టాలీవుడ్​లో ఈ మధ్య చాలా మంది యంగ్ హీరోలు బ్యాచిలర్ లైఫ్​కి గుడ్ బై చెప్పి.. ఫ్యామిలీ లైఫ్​లోకి ఎంటర్ అవుతున్నారు. ఈ మూడేళ్ల కాలంలో చాలా మంది సెలబ్రిటీలు కూడా పెళ్లి చేసుకున్నారు. అయితే.. పెళ్లి చేసుకోవాల్సిన బ్యాచిలర్ బాబులు కూడా చాలామందే తెలుగు ఇండస్ట్రీలో ఉన్నారు. వారిలో ఎనర్జిటిక్​ హీరో రామ్ పోతినేని ఒకరు. అయితే.. ఇప్పుడు రామ్ తన గర్ల్ ఫ్రెండ్​ను పెళ్లి చేసుకోబోతున్నట్లు ఫిలింనగర్​లో టాక్​ వినిపిస్తోంది. తన స్కూల్ ఫ్రెండ్ అయిన ఓ అమ్మాయితో రామ్ చాలా కాలంగా ప్రేమలో ఉన్నారని.. ఇప్పుడు ఆమెనే పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్నారని సమాచారం.

దీనికి.. ఇరు కుటుంబాలకు చెందిన పెద్దలు కూడా ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. అందరి సమక్షంలో వీరి వివాహం జరగబోతుందని టాక్. త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తారట. ఇదివరకు ఇట్లనే రామ్ పెళ్లి గురించి వార్తలు రాగా.. పెళ్లి అనేది మన చేతుల్లో ఉండదని, జరగాల్సిన టైమ్​లో జరుగుతుందని చెప్పుకొచ్చారు లవర్​ బోయ్​.. మరి ఇప్పుడు ఆ సమయం వచ్చినట్లే ఉందా అని చాలామంది రామ్​ని క్వశ్చన్​ చేస్తున్నారు.

ఇక.. రామ్ నటిస్తున్న ‘వారియర్’ సినిమా రిలీజ్ తర్వాత ఎంగేజ్మెంట్ చేసుకొని ఈ ఏడాదిలోనే పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నారట. ఇంకా.. రామ్ ప్రేమిస్తున్న అమ్మాయి వివరాలు మాత్రం బయటకు రాలేదు. మరి ఈ పెళ్లి వార్తలపై రామ్ రియాక్షన్​ ఎట్లుంటుందో చూడాలి. సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం లింగుస్వామి దర్శకత్వంలో ‘వారియర్’ సినిమాలో నటిస్తున్న రామ్ దీని తర్వాత బోయపాటి డైరెక్షన్​లో మరో యాక్షన్​ ఓరియంటెడ్​ మూవీ చేయనున్నట్టు తెలుస్తోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement