Saturday, May 4, 2024

పీజీ వైద్యయాజమాన్య కోటా సీట్ల భర్తీకి ఏప్రిిల్‌ 1న వెబ్‌ ఆప్షన్లు..

వరంగల్‌, ప్రభన్యూస్‌ ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రంలోని ప్రైవేట్‌ వైద్య కళాశాలల్లో పీజీ వైద్య యాజమాన్య కోటా సీట్ల భర్తీకి కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం గురువారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. మిగిలిన పీజీ యాజమాన్య కోటాసీట్లను ఈ మాప్‌ ఆఫ్‌ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయనున్నారు. యాజ మాన్య కోటాకు ఇప్పటకే రెండు విడతల కౌన్సెలింగ్‌ పూర్తయింది. తుది మెరిట్‌ జాబితాలోని అర్హులైన అభ్యర్దులు వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. ఏప్రిల్‌ 1వ తేదిన ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ప్రాధాన్యత క్రమంలో కళాశాలల వారీగా వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. గత విడత కౌన్సెలింగ్‌లో సీట్‌ అలాట్‌ అయి జాయిన్‌ కాకపోయినా చేరి డిస్‌కంటిన్యూ చేసినా అదేవిధంగా ఆల్‌ ఇండియా కోటాలో ఇప్పటికే చేరిన అభ్యర్థులు ఈ కౌన్సెలింగ్‌కు అనర్హులు పూర్తి వివరాలకు విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌ WWW.KNRUHS.Telangana.jivov.in లో చూడాలని యూనివర్సిటీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement