Monday, May 6, 2024

Big story | కేంద్ర జల సంఘానికి వార్ధా ప్రాజెక్టు డీపీఆర్‌.. రీఇంజనీరింగ్‌ తో తగ్గిన మహారాష్ట్ర ముంపు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దుల్లో ముంపు తగ్గిస్తూ నిర్మిస్తున్న డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌వార్ధా ప్రాజెక్టు డీపీఆర్‌ను సిీడబ్ల్యూసీకి రాష్ట్ర ప్రభుత్వం సమర్పించింది. గత ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంలో 56 వేల 500 ఎకరాలకు సాగునీరు అందించేందుకు రూపొందించిన ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టు రీడిజైన్‌ చేసి మహారాష్ట్రలో ముంపు తగ్గించి లక్షా 40 వేల ఎకరాల ఆయకట్టుకు నీరందించేందుకు తలపెట్టిన ఈ భారీ ప్రాజెక్టు సమగ్ర అభివృద్ధి నివేదికను సీడబ్ల్యూసీకి సమర్పించింది. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు పర్యావరణ, అటవీ శాఖ అనుమతులు, నీటి లభ్యత, మహారాష్ట్ర ప్రభుత్వం సహకారం ఉండటంతో లాంఛనంగా రాష్ట్ర ప్రభుత్వం డీపీఆర్‌ సమర్పించింది.

మంచిర్యాల జిల్లాలో పెన్‌గంగా వార్థా నదుల సంగమం సమీపంలోని వార్థా నది ఎగువప్రవాహం పై ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టింది. 16సెప్టెంబర్‌ 2022లో జీఓ నం. 311 ద్వారా ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పేరు, నిర్మాణ స్థలం మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతంలో ప్రతిపాదించిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్‌ మార్చి బీఆర్‌ అంబేద్కర్‌వార్ధా ప్రాజెక్టు గా ప్రభుత్వం నిర్మిస్తోంది. తొలుత ప్రతిపాదించిన ప్రాజెక్టుతో మహారాష్ట్రలో 85శాతం ముంపు తెలంగాణలో 15 శాతం ముంపు ఉండటంతో మహారాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణ స్థలం మార్చడంతో మహారాష్ట్ర లో 85 శాతం ముంపు నుంచి 23 శాతానికి తగ్గడంతో సమస్య పరిష్కారమై పనులు ప్రారంభమయ్యాయి.

- Advertisement -

అయితే ఈ ప్రాజెక్టు స్థలం మార్చిన అనంతరం లాంఛనంగా సీడబ్ల్యూసీకి డీపీఆర్‌ సమర్పించింది. అయితే నిపుణుల కమిటీతో చర్చించిన అనంతరం సీడబ్ల్యూసీ సూచనలు చేయనుంది. తుమ్మిడిహట్టి ప్రాజెక్టు ఎగువన వేర్దండి దగ్గర నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు లక్షా 40వేల ఎకరాల ఆయకట్టుస్థిరీకరణతో పాటుగా వేలాది ఎకరాలు సాగులోకి రానున్నాయి. అలాగేప్రాజెక్టు పరిధిలోని గ్రామాలకు తాగునీటిని అందించనుంది. 11.5 టీఎంసీల సామర్థ్యంతోనిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు అంచనావ్యయం రూ. 4వేల 550 కోట్ల 73 లక్షలు గాప్రభుత్వం ప్రతిపాదించింది గత సమైక్యపాలకులు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్‌ చేసి కాంట్రాక్టర్లకు పనులు అప్పగించారేకానీ సరిహద్దు రాష్ట్రం మహారాష్ట్ర అనుమతి తీసుకోలేదు. పైగా మహారాష్ట్ర సరిహద్దుల్లో ముంపు అధికంగా ఉండటంతోఈ ప్రాజెక్టును మహారాష్ట్ర వ్యతిరేకించింది.

ఫలితంగా ఆనాటిపాలకులు ప్రాజెక్టు నిర్మాణాన్ని నిలిపివేశారు. అలాగేప్రాజెక్టు ఎఫ్‌ఆర్‌ఎల్‌, బ్యారేజిగేటు కనిష్ట మట్టం,ముంపు తదితర సాంకేతిక అంశాలను నిర్ధారించేటప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరపక ఏకపక్ష నిర్ణయం తీసుకోవడంతో ప్రాజెక్టును మహారాష్ట్ర వ్యతిరేకించింది. అలాగే ప్రాజెక్టు సమీపంలో చాప్రాల్‌ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఉండటంతో పర్యావరణ అనుమతులు లభించలేదు. ఈ ప్రాజెక్టును నిలిపివేయాలని 2008లో అప్పటి సమైక్యపాలకులకు సీడబ్ల్యూసీ లేఖ రాసింది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం ప్రాజెక్టును నిర్మించాలనే పట్టుదలతో సీఎం కేసీఆర్‌ 2016మార్చి 19న బీఆర్‌ అంబేద్కర్‌ ప్రాణహిత ప్రాజెక్టు అంతరాష్ట్ర సమన్వయ కమిటీతో సమావేశమై రీఇంజనీరింగ్‌ కోసం వాప్కోస్‌ కు బాధ్యతలు అప్పగించారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాలమేరకు రీఇంజనీరింగ్‌ తో వార్థా ప్రాజెక్టు పనులు ప్రారంభించి సమగ్ర అభివృద్ధి నివేదికను సీడబ్ల్యూసీ కి సమర్పించారు. సీడబ్ల్యూసీ సూచనలు రాగానే పనుల్లో వేగం పెంచేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ ప్రాజెక్టు నిర్మాణంతో ఉత్తర తెలంగాణలోని అనేక మారుమూల ప్రాంతాల్లోని సాగుభూములు సస్యశ్యామలం కానున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement