Saturday, May 18, 2024

మోడీ ప‌ర్య‌ట‌న‌తో క‌ర్నాట‌క‌లో కాషాయ గాలులు….

న్యూఢిల్లి : కర్నాటకలో కొత్త చరిత్ర లిఖించబడుతోందా అంటే పరిస్థితులు అలాగే కనిపిస్తున్నాయి. గత 38 ఏళ్లుగా ఇక్కడ అధికార పార్టీ వెనువెంటనే అధికారాన్ని చేపట్టలేక పో యింది. ఇంకో అయిదు రోజుల్లో ఎన్నికల ప్రచారం ముగు స్తుండగా, రాజకీయ పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ వరుస సభలతో అనూ హ్యంగా ఓటర్లు కమలం వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో సర్వేలన్నీ పక్కనబెట్టాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మెజారటీ సర్వేలు కాంగ్రెస్‌ అధికారానికి చేరువలో ఉన్నట్టు చెబుతుండగా, మరికొన్ని సర్వేలు భాజపాకు స్వల్ప మెజారిటీ వస్తుందని చెప్పాయి. కాని, పరిశీలకులు మాత్రం హంగ్‌ ఏర్ప డుతుందని, జేడీఎస్‌ కింగ్‌ మేకర్‌ అవుతుందని ఇప్పటివరకూ చెబుతూ వస్తున్నారు. నిన్న మొన్నటి వరకూ ప్రధాని నరేంద్ర మోడీ కూడా పరోక్షంగా ఇదే విషయం చెబుతూ, జేడీఎస్‌కు ఓటేస్తే కాంగ్రెస్‌కు ఓటేసినట్టేనని, కింగ్‌ మేకర్‌ పాత్ర పోషిస్తుం దని, అభివృద్ధి కుంటుపడుతుందని చెప్పారు.

మోడీ ఇమేజ్‌
పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఇందుకు ప్రధానంగా అయిదు అంశాలను ప్రస్తావిస్తున్నారు. ఇందులో మొదటిది ప్రధాని మోడీ ఇమేజ్‌. ఆయన సుడిగాలి పర్యటనలు యువత, మహిళ లపై విపరీతమైన ప్రభావం చూపిస్తున్నాయి. ఇక కార్యకర్తలను కట్టిపడేస్తున్నాయి. కొంతమంది నేతలు టిక్కెట్లు దక్కకపోవ డంతో మొదట్లో కార్యకర్త లలో కూడా ఆ ప్రభావం కనిపిస్తుం దని సందేహించినా అవన్నీ పటాపంచలయ్యాయి. దాదాపు 53 వేల మంది బూత్‌ కార్య కర్తలతో ప్రధాని స్వయంగా మాట్లాడడంతో వారిలో నూత నోత్సాహం కనిపిస్తోంది. ఆయన ప్రసంగాలను కన్నడంలోకి తర్జూమా చేయించడంతో సామాన్యులకు కూడా ఆయన చెప్పాలనుకున్నది అర్ధమవు తోంది. క్రమేణా భాజపా వైపు ఎటూ తేల్చుకోలేని నిర్ణయాత్మక ఓటర్లు మారుతున్నారు. తన విజన్‌ వాస్తవ రూపం దాల్చాలంటే కార్యకర్తలు మరింత కష్టపడాలని చెబుతూ, డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ ప్రయో జనాలను వివరిస్తున్నారు.

ఓట్‌ షేర్‌… సీట్లు వేర్వేరు
ఇక రెండో అంశం విషయానికి వస్తే అది ఓట్‌ షేర్‌. గత ఎన్ని ³కల కంటే ఈసారి కాంగ్రెస్‌కు ఓటింగ్‌ శాతం పెరుగుతుం దని అన్ని సర్వేలు అంగీకరిస్తున్నాయి. కాంగ్రెస్‌కు రాష్ట్ర వ్యా ప్తంగా ఒకేవిధమైన ఓటింగ్‌ శాతం లభిస్తుండగా, భాజపాకు మాత్రం కొన్ని ప్రాంతాల్లో మాత్రమే అధిక ఓటింగ్‌ శాతం ఇప్పటివరకూ లభిస్తోంది. కచ్చితంగా ఆయా ప్రాంతా ల్లోనే అత్యధిక సీట్లు కూడా వస్తున్నాయి. 1989 నుంచి ఓటింగ్‌ శాతంతో పాటు సీట్లు కూడా భాజపాకు పెరుగుతూ వస్తున్నా యి. కర్నాటకలో తమ ఓట్లు, సీట్ల శాతాన్ని ప్రతిసారీ పెంచు కుంటూపోతోంది. కాంగ్రెస్‌ విషయానికి వస్తే ఈ శాతం తగ్గు తుండడం గమనార్హం. 2013లో తప్ప భాజపా ఓట్లు, సీట్లు తగ్గడం కనిపించలేదు. అలాగే, జేడీఎస్‌ కూడా మైసూరు ప్రాం తంలో విపరీతమైన ప్రభావాన్ని చూపిస్తోంది. ఇక్కడ ఆ పార్టీకి కాంగ్రెస్‌, భాజపాల కంటే అధికంగా ఓట్లు, సీట్లు లభిసు ్తన్నా యి. కాని, ఈసారి పరిస్థితిలో గణనీయ మార్పు కనిపి స్తోంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ భాజపా ఓట్లు, సీట్ల శాతాన్ని పెరుగుతుందని విశ్లేషిస్తున్నారు.

కుల గణాంకాలు
రాష్ట్రంలో మరో ముఖ్యమైన అంశం కులం. ఇక్కడ ముఖ్యంగా మూడు వర్గాలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ఎస్సీ, ఎస్టీ వెనుకబడిన వర్గాలు, ఒక్కలిగ, లింగాయత్‌లు. మొదటి వర్గానికి సంబంధించి కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జన ఖర్గే అత్యధిక ప్రభావం చూపిస్తున్నారనడంతో ఎటువంటి సందేహం లేదు. ఈ వర్గాల ఓట్లన్నీ గంపగుత్తగా తమకే లభిసా ్తయని కాంగ్రెస్‌ భావిస్తుండగా, ఎంతో కొంత తమకు మొగ్గు చూపుతారని భాజపా ఆశిస్తోంది. పెంచిన రిజర్వేషన్లతో పాటు తమ మాస్‌ నాయకుడు యెడ్యూరప్ప లింగాయత్‌లలో విప రీతమైన ప్రభావం చూపుతారని, అలాగే, ఒక్కలిగ ఓటర్లు కూ డా ఈసారి తమవైపే మొగ్గు చూపుతారని భాజపా చెబుతోంది. వాస్తవానికి లింగాయత్‌లు, ఒక్కలిగ వర్గాల్లో రిజర్వేషన్ల ప్రభా వం కనిపిస్తోంది. దీనికితోడు యెడ్యూరప్ప ఆయన కుమా రుడు విజయేంద్రలు కూడా తమకున్న అసంతృప్తిని పక్కన బెట్టి రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్నారు. 2013లో సొంత కుం పటి పెట్టుకుని యెడ్యూరప్ప విడిపోయనప్పడు కూడా భాజ పాతో కలిపి 92 సీట్లు వచ్చిన అంశాన్ని పరిశీలికులు గుర్తు చేసు ్తన్నారు. ఈసారి అటువంటి పరిస్థితి లేకపోగా, మోడీ ఫ్యాక్టర్‌ అదనపు ఆకర్షణ తోడవుతోంది. దీంతో మైసూరు ప్రాంతంలో కూడా ఓట్లు, సీట్లు కొల్లగొడతారని భావిస్తున్నారు.

పోల్‌ మేనేజ్‌మెంట్‌
ఇక ప్రధానంగా పోల్‌ మేనేజ్‌మెంట్‌ విషయానికి వస్తే భాజపా ఇందులో ఆరితేరిపోయింది. కాంగ్రెస్‌ ఓట్ల శాతం అధి కంగా ఉన్న చోట్ల కూడా పోల్‌ మేనేజ్‌మెంట్‌ లోపంతో ఎన్నో సీట్లను గతంలో కోల్పోయిన అంశం ఇక్కడ ప్రస్తావనార్హం. దీనికితోడు భాజపా దిగ్గజం అమిత్‌షా గత 70 రోజుల్లో 20 సార్లు కర్నాటక పర్యటనకు వచ్చి పోల్‌ మేనేజ్‌మెంట్‌తో సహా అనేక అంశాల్లో కార్యకర్తలను జాగృతం చేశారు. కాంగ్రెస్‌ విషయానికి వస్తే ఎవరికి వారు యమునాతీరే అన్న చందంగా కనిపిస్తోంది తప్ప కలిసికట్టుగా ఒక నిర్దిష్ట ప్రణాళిక వారిలో కనిపించడం లేదు. దీంతో పోలింగ్‌ రోజు భాజపా ఎత్తుగడలకు కాంగ్రెస్‌ చత్తవడం ఖాయమని చెబుతున్నారు.

బజరంగ్‌దళ్‌
భాజపా హిందుత్వ అస్త్రానికి కర్నాటకలో మరింత పదునుపెట్టింది. బజరంగ్‌దళ్‌ నినాదాన్ని బయటకు తీసింది. దీంతో యువత, మహిళా ఓటర్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. బజరంగ్‌దళ్‌ను నిషేధించి కాంగ్రెస్‌, జేడీఎస్‌లు మైనారిటీ ఓటర్లను బుజ్జగించాలని చూస్తున్నాయని ప్రధాని మోడీ చేసిన ప్రసంగం హిందూ ఓటర్లలో అనూహ్య ప్రభావం చూపుతోంది. పోలింగ్‌ సమీపిస్తుండగా, ఆఖరి అస్త్రంగా భాజపా సంధించిన నినాదంతో అంచనాలన్నీ తలకిందులవు తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement