Sunday, May 5, 2024

ఉక్రెయిన్‌ వార్‌లోకి వాలి, రష్యాకు వ్యతిరేకంగా రంగంలోకి స్నైపర్‌..

యుద్ధాలు కేవలం యుద్ధభూమికే పరిమితం కాదు. ముఖ్యంగా టెక్నాలజీ విస్తరించిన ప్రపంచంలో యుద్ధక్షేత్ర పరిధి పెరిగింది. ప్రస్తుతం జరుగుతున్న రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధమే ఇందుకు నిదర్శనం. రష్యన్‌ వైమానిక దాడుల నుంచి గగనతలాన్ని రక్షించుకునేందుకు కీవ్‌పై ఎనిగ్మాగా కనిపించిన మిస్టీరియస్‌ మిగ్‌-29 ఫైటల్‌ పైలట్‌ (కీవ్‌ ఘోష్ట్‌ )ను ఉక్రెయిన్‌ రంగంలోకి దించింది. అయితే ఈ ఎత్తుగడ అంతగా ఫలించలేదు. దాంతో కెనడియన్‌ స్నైపర్‌ను వాలి అనే మారుపేరుతో రణక్షేత్రంలోకి ప్రవేశపెట్టింది.

ఎవరీ వాలి?

రష్యన్లతో పోరాడేందుకు వాలి స్వచ్ఛందంగా ముందుకొచ్చినట్లు తెలుస్తోంది. ప్రపంచంలోని అత్యుత్తమ స్నైపర్‌లలో ఒకడైన ఇతను రాయల్‌ కెనడియన్‌ 22వ రెజిమెంట్‌కు చెందిన కంప్యూటర్‌ సైంటిస్ట్‌. జెలెన్‌స్కీ పిలుపు మేరకు గతవారమే ఉక్రెయిన్‌ దళాలతో చేరాడు. మొదటి రెండు రోజుల్లోనే ఆరుగురు రష్యన్‌ సైనికు లను హతమార్చాడు. తన విధుల్లో భాగంగా అఎ్గnాన్‌లో పదుల సంఖ్యలో శత్రువులను మట్టుపెట్టిన క్రమంలో అక్కడి ప్రజలు ఈ పేరు పెట్టారు. 2009-11 మధ్య అఎn్గాన్‌ యుద్ధంలో ఇతను రెండుసార్లు పనిచేశాడు. 2015 లో ఐసిస్‌కు వ్యతిరేకంగా పోరాడేందుకు స్వచ్ఛందంగా ఇరాక్‌ వెళ్లాడు. విదేశీయులు తమకు స#హకరించాలని ఇప్పుడు జెలెన్‌స్కీ ఇచ్చిన పిలుపు.. ఆయనకు అలారం బెల్‌లా వినిపించిందట. అందుకే తన భార్య, ఏడాది కూడా నిండని కుమారుడిని వదిలేసి, ఈ యుద్ధంలో దూకేశాడు. అనుభవజ్ఞులైన ఉక్రేనియన్‌ అధికారులను కలుసుకోవడానికి ముందు ఓ పాడుబడిన ఇంటిలో ఆశ్రయం పొందాడు.

అందుకే వచ్చాను..

వచ్చేవారం అతడి కుమారుడి మొదటి పుట్టిన రోజు జరగనుంది. కానీ ఈ సమయంలో ఉక్రెయిన్‌ ప్రజలకు తన సహాయం అవసరమని వచ్చేశాడు. వీరు ఐరోపా వాసులుగా ఉండాలనుకుంటున్నారు. రష్యన్‌గా ఉండ కూడదని అనుకోవడం వల్ల బాంబు దాడులకు గురవుతున్నారని ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పేర్కొ న్నాడు. ప్రపంచంలోనే అత్యుత్తమ స్నైపర్‌గా పేరుపొందిన అతడు.. అత్యధికంగా రోజుకు 40 మందిని మట్టు పెట్టగల సత్తా ఉన్నవాడట. మాములుగా సగటు స్నైపర్‌ రోజుకు 5 నుంచి 6 లక్ష్యాలను చేధించగలడు. అదే ఉత్తమ పనితీరు ప్రదర్శించేవారు రోజుకు 7 నుంచి 10 వరకూ ఛేదిస్తారు. ఇక వలి.. 2017లో 3,540 మీటర్ల దూరంలో ఉన్న ఐఎస్‌ జిహాదిని కాల్చి చంపాడు. ఇంత సుదీర్ఘ దూరంలో ఉన్న లక్ష్యాన్ని చేధించడంలో అతడిదే రికార్డు. తనతోపాటు మరో ముగ్గురు కెనడా సైనికులు కూడా ఉక్రెయిన్‌ వచ్చారని వాలి చెప్పాడు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement