Friday, April 26, 2024

VS11 నుంచి విశ్వ‌క్ స్ట‌న్నింగ్ లుక్.. సీనియర్ ఎన్టీఆర్‌కి నివాళిగా ఫ‌స్ట్ లుక్

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ దాస్ కా ధమ్కీ తో మంచి కమర్షియల్ హిట్ సొంతం చేసుకున్నాడు. ఇక ప్ర‌స్తుతం డైరెక్ట‌ర్ కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు. తాత్కాలికంగా VS11 అనే టైటిల్‌తో షూటింగ్ జ‌రుపుకుంటుంది ఈ సినిమా. కాగా, తాజాగా.. ఈ మూవీ నుంచి విశ్వ‌క్ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.

- Advertisement -

పోస్టర్‌లో విశ్వక్ సేన్ మాస్ అవతార్‌లో సిగార్ తాగుతున్నట్లు క‌నిపిస్తాడు. పోస్టర్ అద్భుతంగా ఉంది.. చూస్తుంటే మరోసారి మాస్ క్యారెక్టర్‌లో విశ్వక్ రాక్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ రోజు లెజెండరీ ఎన్టీఆర్ 100వ జయంతి కావడంతో, దివంగత నటుడికి నివాళులర్పిస్తూ మేకర్స్ ఈ పోస్టర్‌ను విడుదల చేశారు. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందిస్తుండ‌గా… ఫార్చూన్ ఫోర్ సినిమాతో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ మూవీని నిర్మిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement