Thursday, May 16, 2024

వైరస్ బాధితులు 40 ఏండ్లలోపువారే

దేశ వ్యాప్తంగా సెకండ్ లో వైరస్ బారిన పడుతున్న వారిలో 70శాతం మంది 40 ఏళ్లలోపు వారేనని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బల రాం భార్గవ స్పష్టం చేరు. 40ఏళ్లలోపు వారే అత్యధికంగా ఎటువంటి కరోనా లక్షణాలు బహిర్గతం కాకుండానే శ్వాసకోశ సమస్యలతో ఆసుపత్రుల్లో చేరుతున్నారని చెప్పారు. కరోనా మొదటివేవ్ తో పోల్చుకుంటే సెకండ్ వేవ్ వైరస్ తీవ్రత భారత దేశంలో తక్కువగా ఉందని చెప్పారు. ఈ మేరకు ఢిల్లీలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఐసీఎంఆర్ పరిశోధనలో సెకండ్ వేవ్ లో వైరస్ లక్షణాలు చాలా తక్కువగా ఉన్నట్లు తేలిందన్నారు. వంటి నొప్పులు, వాసన, రుచిని పసిగట్టే శక్తి కోల్పోవడం, జ్వరం వంటి లక్షణాలు సెకండ్ వేవ్ లో వైరస్ సోకిన పేషెంట్లలో గతంలోలాగా లేవని స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement