Thursday, May 9, 2024

సాయిధ‌ర‌మ్ తేజ్ రిస్కీ బైక్ స్టంట్స్..

బైక్ యాక్సిడెంట్ నుండి కోలుకున్న హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ ప‌లు ప్రాజెక్టుల‌తో దూసుకుపోతున్నాడు. కాగా త‌న తాజా చిత్రం విరూపాక్ష కోసం రిస్కీ బైక్ స్టంట్స్ చేశాడ‌ట సాయిధ‌ర‌మ్. ఈ చిత్రాన్ని కార్తీక్ దండు తెర‌కెక్కిస్తున్నాడు. కాంతార ఫేం అంజనీశ్‌ లోక్‌నాథ్‌ ఈ చిత్రానికి మ్యూజిక్‌, బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ అందిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న విరూపాక్ష చిత్రాన్నిశ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర-సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్లపై సంయుక్తంగా బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్నారు.
విరూపాక్షలో బ్రహ్మాజీ, అజ‌య్‌, సునీల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే స్టార్ హీరో ఎన్టీఆర్‌ వాయిస్‌ ఓవర్‌తో సాగుతున్న టైటిల్ గ్లింప్స్ వీడియో గూస్‌ బంప్స్ తెప్పిస్తోంది. కాగా సాయిధరమ్‌ తేజ్ భయాన్ని అధిగమించి ధైర్యంగా చేసిన రిస్కీ స్టంట్ గురించి కార్తీక్‌ దండు టీం వివరిస్తున్న వీడియో నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. ఈ చిత్రంలో సంయుక్తా మీన‌న్ ఫీ మేల్ లీడ్‌ రోల్‌ పోషిస్తోంది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement