Wednesday, May 8, 2024

వీడియో: గేదెపై పిల్లాడి స్నానం

టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సామాజిక మాధ్య‌మాల్లో ఆస‌క్తిక‌ర వీడియోలు పోస్ట్ చేస్తూ అభిమానుల‌ను అల‌రిస్తుంటారు. తాజాగా ఆయ‌న పోస్ట్ చేసిన ఓ వీడియో బాగా వైర‌ల్ అవుతోంది. ఇందులో ఓ గేదెపైకి ఎక్కి ఓ పిల్లాడు స్నానం చేస్తున్నాడు. పైపుతో గేదెపైకి ఎక్కిన ఆ పిల్లాడు త‌న‌పై నీళ్లు పోసుకుంటుండ‌గా ఓ బాలీవుడ్ పాట‌ను యాడ్ చేశారు. అలాగే, గేదెపై ప‌డుకుని, కూర్చుని స్నానం చేయ‌డానికి ఆ బాలుడు ప్ర‌య‌త్నిస్తుంటాడు. గ్రామాల్లో జీవితం ఇలా స‌ర‌దాగా గ‌డిచిపోతుంటుంద‌ని, న‌గ‌రాల్లో ఉన్న‌వారికి ఇటువంటి స‌ర‌దాల గురించి తెలియ‌ద‌ని సెహ్వాగ్ పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: తల వెంట్రుకల మాఫియాపై ఈడీ దర్యాప్తు ముమ్మరం..

Advertisement

తాజా వార్తలు

Advertisement