Thursday, April 25, 2024

వీడియో: కర్రసాములో ఇరగదీసిన పవన్ తనయుడు అకిరానందన్

పవర్ స్టార్ పవన్​ కల్యాణ్​, రేణుదేశాయ్ దంపతుల కుమారుడు అకీరానందన్ ఇప్పుడిప్పుడే స్టార్ డమ్ సంపాదించుకుంటున్నాడు. అయితే తాజాగా రేణు దేశాయ్​ సోషల్​ మీడియా వేదిక ఇన్​ స్టాగ్రామ్​‌లో ఓ వీడియోను పంచుకుంది. పవర్​ స్టార్​ కుమారుడు అకీరానందన్​ కర్ర సాము చేస్తున్న వీడియో అది. చాలా పెరిగిపోయిన అకీరా కర్ర సాముని ఇరగదీస్తున్నాడు. అందుకు సంబంధించిన వీడియోను రేణు అభిమానులతో పంచుకోవడం విశేషం. ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ వీడియో చూసిన పవర్​ స్టార్​ అభిమానులు ఫుల్​ ఖుషీగా ఫీలవుతున్నారు. త్వరలోనే అకీరానందన్​ హీరోగా దర్శనం ఇస్తాడని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

పవన్​ కల్యాణ్​ , రేణు దేశాయ్​ లకు అకీరానందన్​ కాకుండా మరో సంతానం కూడా ఉంది. ప్రస్తుతం రేణు దేశాయ్​ పవన్​ కల్యాణ్​‌తో వేరుగా ఉంటుంది. పవన్​ కల్యాణ్​ ప్రస్తుతం మూడో పెళ్లి చేసుకున్నాడు. కాగ రేణు దేశాయ్​ అభిమానులతో ఎప్పుడూ టచ్​ లో ఉండడమే కాకుండా కరోనా లాక్​ డౌన్​ సమయంలో అనేక మందికి సాయం చేసింది. తాను దేశంలో జరుగుతున్న సమస్యలపై కూడా తన దైన శైలిలో స్పందిస్తూ ఉంటుంది.

https://www.youtube.com/watch?v=gZLtU7VX8bI
Advertisement

తాజా వార్తలు

Advertisement