Sunday, April 28, 2024

వైరల్ వీడియో: ఢిల్లీలో కారులే ఆస్పత్రులుగా మారిన వేళ..

దేశ రాజధాని ఢిల్లీలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. కోవిడ్ పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో ఆస్పత్రుల్లో బెడ్లు దొరకడం లేదు. దీంతో కరోనా పేషెంట్లకు సరైన చికిత్స అందడం లేదు. కార్లు ఉన్న వాళ్లు ఆక్సిజన్ సిలిండర్లు కొనుగోలు చేసి కార్లనే ఆస్పత్రులుగా మార్చుకుంటున్నారు. రోడ్లపైనే కార్లను నిలిపివేసి పక్కనే ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకుని ప్రాణవాయువును పొందుతున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో నెలకొన్న ఈ సన్నివేశాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఓ ఎన్‌జీవో ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసి కరోనా బాధితులకు ఇలా కార్లలో ఆక్సిజన్ అందిస్తున్నట్లు తెలుస్తోంది.

కాగా ఢిల్లీలో కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్‌ను మరో వారం రోజులు పొడిగిస్తున్నట్టు ఇటీవల సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. గతంలో విధించిన లాక్‌డౌన్ సోమవారం ఉదయంతో పూర్తి కాగా.. మరోసారి దీనిని పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో మే 3 ఉదయం 5 గంటల వరకు లాక్‌డౌన్ కొనసాగుతుందని సీఎం కేజ్రీవాల్ స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement