Tuesday, May 21, 2024

పెద్దవాగులో చిక్కుకున్న గ్రామ‌స్తుడు …స‌హాయ కార్య‌క్ర‌మాల‌లో క‌లెక్ట‌ర్, ఎమ్మెల్యే

ఎల్లారెడ్డి,సెప్టెంబర్ 4 (ప్రభ న్యూస్): కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం గాంధారి మండలంలోని మాతుసంఘం గ్రామ సమీపంలోనీ గాంధారి పెద్దవాగు ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి సోమవారం ఉదృతంగా ప్రవహిస్తున్నది వాగు ఉధృతిలో చిక్కుకున్న గౌరీ సంగయ్య అనే వ్యక్తినీ కాపాడడం కోసం అధికారులు సహాయక చర్యల కోసం వాగు వద్దకు చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.

అక్కడికి చేరుకున్న ఎమ్మెల్యే జాజాల సురేందర్ వాగులో చిక్కుకున్న గౌరి సంగయ్య తో ఫోన్లో మాట్లాడి అతనికి ధైర్యంచెప్పారు .వారి వెంట కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్, ఎల్లారెడ్డి డిఎస్పి శ్రీనివాసులు దగ్గర ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నాను.

Advertisement

తాజా వార్తలు

Advertisement