Wednesday, May 1, 2024

విక్ర‌మ్ చిత్రం నుండి – సూర్య లుక్ పోస్ట‌ర్ రిలీజ్

విక్ర‌మ్ చిత్రంలో త‌మిళ స్టార్ హీరో సూర్య న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం జూన్‌ 3న ప్రపంచవ్యాప్తంగా సినిమా రిలీజ్​ కానుంది. కాగా ఈ చిత్రంలో సూర్య లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. సినిమాలో సూర్య ఎలా ఉంటాడని ఇప్పటివరకు ఎలాంటి ఫోటోను రిలీజ్ చేయని చిత్రయూనిట్.. సినిమా విడుదలకు రెండు రోజుల ముందు రివీల్ చేయడంతో ఫ్యాన్స్ సంతోషాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. ఈ సినిమాలో స్టార్స్​ విజయ్ సేతుపతి, ఫహద్​ ఫాజిల్​ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవలే విడుదలైన చిత్ర ట్రైలర్​లో​ కమల్​తో పాటు వీరి యక్షన్ కూడా​ అదిరిపోయింది. కాగా, ఈ చిత్రాన్ని రాజ్‌ కమల్‌ ఫిల్మ్స్‌ ఇంటర్నేషనల్‌ పతాకంపై కమల్‌హాసన్‌, ఆర్‌. మహేంద్రన్‌ సంయుక్తంగా నిర్మించారు. అనిరుధ్‌ స్వరాలందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement