Friday, April 26, 2024

న్యూ లుక్ లో విజయ్ సేతుపతి.. సూపర్ అంటోన్న ఫ్యాన్స్

తమిళ హీరో విజయ్ సేతుపతి ప్రస్తుతం ఉన్న హీరోల్లో కంటే డిఫరెంట్ అనే చెప్పాలి. బొద్దయిన రూపం…సహజమైన నటనతో ఎంతో మంది అభిమానులని సంపాదించుకున్నాడు. తమిళ ఇండస్ట్రీలోనే కాకుండా తెలుగులో కూడా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు . హీరో అంటే కండలు.. ఫిట్ నెస్ కాకుండా.. బొద్దుగానూ కనిపించి ఎంతో అభిమానుల మనసు దొచుకున్నారు మక్కల్ సెల్వన్. వాస్తవానికి విజయ్ యాటిట్యూడ్.. బొద్దుగా ఉండే అతని బాడీ కూడా చాలా మందికి ఇష్టం.

అయితే ఎప్పుడూ రగ్గడ్ లుక్‏లో కనిపించే మక్కల్ సెల్వన్.. ఇప్పుడు స్టైలిష్ లుక్ లోకి మారిపోయి ఫ్యాన్స్ కు షాకిచ్చారు. పూర్తిగా వెయిట్ లాస్ అయ్యి స్లిమ్‏గా మారి స్టైలిష్ గా తీసుకున్న సెల్ఫీని తన ఇన్ స్టాలో షేర్ చేశారు. ప్రస్తుతం మక్కల్ సెల్వన్ న్యూలుక్ ఫోటో సోషల్ మీడియాలో వైరలవుతుంది. విజయ్ సేతుపతి న్యూలుక్ చూసి ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. హీరోగానే కాకుండా.. విలన్ గా కూడా మెప్పించారు. కేవలం నటుడిగానే కాకుండా.. నిర్మాత.. గాయకుడిగా.. హోస్ట్ గా అన్ ని రంగాల్లోనూ ప్రత్యేకతను చాటుకున్నారు. తాజాగా సేతుపతికి సంబంధించిన లేటేస్ట్ ఫోటో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. మక్కల్ సెల్వన్ లుక్ అదిరిపోయిందంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement