Sunday, April 28, 2024

కడుపుబ్బా నవ్వించేందుకు మళ్లీ వస్తున్న వెంకీ.. రీ రిలీజ్​ డేట్​ అనౌన్స్​ చేసిన మేకర్స్​

టాలీవుడ్‌లో మంచి కామెడీ సినిమాల గురించి ప్రస్తావ‌న వ‌స్తే అందులో క‌చ్చితంగా రవితేజ వెంకీ మూవీ ఉంటుంది. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఈ కామెడీ థ్రిల్లర్ లో క‌డుపుబ్బా న‌వ్వించే కామెడీ సీన్స్ తో పాటు ర‌వితేజ కామెడీ & యాక్ష‌న్ టైమింగ్ ప్ల‌స్ పాయింట్ గా నిలిచాయి. ముఖ్యంగా ట్రైన్ ఎపిసోడ్ మెస్ట్ ఐకానిక్ సీన్ అనే చెప్పాలి. ఇక దీంతో ఈ సినిమా అప్పట్లో కమర్షియల్‌గా మంచి విజయం సాధించింది. అయితే సోషల్ మీడియా వ‌చ్చిన త‌రువాత ఈ మూవీ పాపులారిటీ మ‌రింత‌గా పెరిగింది. వెంకీ సినిమా నుండి వచ్చిన కామెడీ సన్నివేశాలు నేటికీ మీమ్స్ రూపంలో రోజూ క‌నిపిస్తూనే ఉంటాయి.

కాగా, రీసెంట్ గా టాలీవుడ్ లో రీ-రిలీజ్ ట్రెండ్ జోరుగా సాగుతోంది. ఈ సందర్భంగా.. చాలా రోజులుగా వెంకీ మూవీని కూడా రీ-రిలీజ్ చేయాలనే డిమాండ్ పెరిగింది. అయితే.. కొన్ని రోజుల క్రితం ఈ మూవీ థియేటర్లలో అతి త్వరలో రీరిలీజ్ కానుందని మేక‌ర్స్ వెల్ల‌డించారు. తాజాగా ఈ సినిమాని డిసెంబ‌ర్ 30న రిలీజ్ చేయ‌నున్న‌ట్టు డేట్ ని కూడి ఫిక్స్ చేస్తూ అభిమానులకు, మీమ్స్ ల‌వ‌ర్స్ కు గుడ్ న్యూస్ ని అందించారు మేక‌ర్స్.

యూత్ కి బాగా నచ్చిన సినిమా ఈ నగరానికి ఏమైంది రీ రిలీజ్ కలెక్షన్స్ తో సంచలనం సృష్టించింది.. అదే విదంగా వెంకీ రిలీజ్ చేస్తే బాక్సాఫీస్ దగ్గర బీభత్సం సృష్టించడం ఖాయం. స్నేహ కథానాయికగా నటించగా, రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చారు. మీ గ్యాంగ్‌తో కలిసి ఈ ఐకానిక్ ఫిల్మ్‌ని చూడటానికి సిద్ధంగా ఉండండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement