Thursday, May 2, 2024

జ‌న‌వ‌రి 6న వీర‌సింహారెడ్డి ప్రీ రిలీజ్ వేడుక‌.. ట్రైల‌ర్ రిలీజ్ అప్పుడేనా

హీరో బాల‌కృష్ణ న‌టిస్తోన్న తాజా చిత్రం వీర సింహా రెడ్డి.. బాలయ్య ఈ చిత్రంలో ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. శృతి హాసన్‌ హీరోయిన్‌గా నటిస్తుంది.గోపీచంద్ మలినేని తెర‌కెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్, లాల్ వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో చిత్రబృందం వరుస అప్‌డేట్‌లు ప్రకటిస్తూ సినిమాపై మంచి బజ్‌ క్రియేట్‌ చేస్తున్నారు.

ప్రస్తుతం చిత్ర యూనిట్‌ ప్రమోషన్‌లను ప్రారంభించే పనిలో ఉంది.ఈ ప్రమోషన్‌లో భాగంగా ఈ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకను పెద్ద ఎత్తులో నిర్వహించాలని ప్లాన్‌ చేస్తుంది. ఈ నేపథ్యంలో జనవరి ఆరో తేదిన ఒంగోలులో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను జరుపనున్నట్లు తెలుస్తుంది. కాగా అదే రోజున ఈ సినిమా ట్రైలర్‌ను కూడా రిలీజ్‌ చేయనున్నారట. అవుట్ అండ్‌ అవుట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాను మైత్రీ మూవీ సంస్థ నిర్మించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement