Saturday, May 4, 2024

Wedding Venue – ఇట‌లీకి వ‌ర‌ణ్, లావ‌ణ్య ప‌య‌నం… గ్రాండ్ గా బ్యాచ్ ల‌ర్ పార్టీ

వరుణ్‌ తేజ్ – లావణ్య త్రిపాఠి ప్రీ వెడ్డింగ్‌ సెలబ్రేషన్స్ వేడుకగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా గ‌త రాత్రి లావణ్య త్రిపాఠి బ్యాచులరేట్‌ పార్టీ జరిగింది. ఆమె స్నేహితులు నీరజ, నితిన్‌ సతీమణి షాలినీ, నిహారిక, రీతూవర్మ తదితరులు పాల్గొన్నారు. కాబోయే వధువుకు అభినందనలు తెలిపారు. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

కాగా,కొద్ది మంది సన్నిహితులు, కుటుంబసభ్యుల సమక్షంలో తమ పెళ్లి జరగాలని భావిస్తున్న వరుణ్‌ తేజ్‌ – లావణ్య జంట.. డెస్టినేషన్‌ వెడ్డింగ్‌కు ప్లాన్‌ చేసింది. ఇటలీలోని టస్కానీని వేదికగా ఎంచుకున్నారు. నవంబర్‌ 1న వరుణ్‌ – లావణ్య వివాహం జరగనుంది. ఇందులో భాగంగానే రామ్‌చరణ్ – ఉపాసన దంపతులు తాజాగా టస్కానీ చేరుకున్నారు. అక్కడి పరిసరాలను చూపిస్తూ తాజాగా ఉపాసన ఓ ఫొటోని షేర్‌ చేశారు. పెళ్లి ఏర్పాట్లు దగ్గరుండి చూసుకునేందుకు ఈ జంట అక్కడికి వెళ్లిందని సమాచారం. కాబోయే వధూవరులు సైతం ఆదివారం నాడు ఇటలీకి పయనమయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement