Friday, May 3, 2024

దూరదర్శన్‌ వార్తా విభాగంలో ఖాళీల భర్తీ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : వార్తా విభాగంలో కాంట్రాక్టు ప్రాతిపదికన పలు ఖాళీలను భర్తీ చేయనున్నట్లు హైదరాబాద్‌ దూరదర్శన్‌ ప్రాంతీయ కేంద్రం తెలిపింది. మొత్తం 11విభాగాల్లో పోస్టులను భర్తీ చేస్తామని తెలిపారు. గ్రేడ్‌1 , గ్రేడ్‌ 2 యాంకర్లు, బులిటెన్‌ ఎడిటర్‌, కాపీ ఎడిటర్‌ తదితర విభాగాల్లో పోస్టులను భర్తీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. నోటిఫికేషన్‌ వివరాలు ప్రసారభారతి వెబ్‌సైట్‌లో ఉన్నట్లు చెప్పారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తులను ప్రసారభారతి లింకు ద్వారా అప్‌లోడ్‌ చేయాలని సూచించారు. నోటిఫికేషన్‌ ప్రచురితమైన 10 రోజుల్లోగా దరఖాస్తులను సమర్పించాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement