Tuesday, February 27, 2024

Ts | వరదలతో దెబ్బతిన్న గ్రామీణ రోడ్లు.. వేగంగా మరమ్మతులు, పునరుద్దరణ పనులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : వరదలతో దెబ్బతిన్న గ్రామీణ రోడ్లకు గ్రామీణ రోడ్ల నిర్వహణా విభాగం వేగంగా మరమ్మతులు చేస్తోంది. వరదలకు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ రోడ్లకు 51చోట్ల గండ్లు పడ్డాయి. 384చోట్ల రోడ్లపైకి వరద నీరు ప్రవహించింది. ఇందులో రాకపోకలకు 435చోట్ల తాత్కాలిక అంతరాయం జరిగింది.శుక్రవారం భారీ వర్షాలు కురవకపోవడంతో పలుచోట్ల వరద తగ్గుముఖం పట్టింది.

దీంతో గ్రామీణ రోడ్ల నిర్వహణ ఈఎన్‌సీ రవీందర్‌రావు నేతృత్వంలో అధికారులు యుద్ధ ప్రాతిపదికన దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేయడంతోపాటు రోడ్లపై నిలిచిన వరద నీటిని తొలగించడంతోపాటు మరోసారి రోడ్లపైకి వరద నీరు పొర్లకుండా మళ్లింపు చర్యలు చేపట్టారు. మేజర్‌గా డ్యామేజ్‌ అయి రాకపోకల బంద్‌ అయిన 112చోట్ల రోడ్లను శుక్రవారమే తిరిగి పునరుద్దరించారు. వరదలకు అత్యధికంగా నిజామాబాద్‌ జిల్లాలో 8చోట్ల, కామారెడ్డిలో 7 చోట్ల, మంచిర్యాలలో 6చోట్ల జగిత్యాల జిల్లాలో 7చోట్ల రోడ్లకు గండ్లు పడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా దెబ్బతిన్న గ్రామీణ రోడ్ల వివరాలను పరిశీలిస్తే…

జిల్లా రోడ్లకు గండి రోడ్లపైకి వరదనీరు మరమ్మతులు పూర్తి

 • నిజామాబాద్‌ 8చోట్ల 41చోట్ల 6చోట్ల
 • కామారెడ్డి 7 24 1
 • సంగారెడ్డి 2 0 0
 • సిద్ధిపేట 0 14 1
 • మెదక్‌ 0 2 1
 • వరంగల్‌ 2 26 17
 • హన్మకొండ 2 11 10
 • మహబూబాబాద్‌ 1 43 25
 • జ.భూపాలపల్లి 3 12 1
 • ములుగు 3 14 0
 • రాజన్నిసిరిసిల్ల 4 23 0
 • జగిత్యాల 7 31 1
 • పెద్దపల్లి 1 19 0
 • కరీంనగర్‌ 0 18 0
 • నిర్మల్‌ 0 1 1
 • ఆదిలాబాద్‌ 2 13 0
 • మంచిర్యాల 6 4 4
 • భద్రాద్రి కొత్తగూడెం 0 2 1
 • ఖమ్మం 0 61 38
 • వికరాబాద్‌ 0 6 5
 • యాదాద్రి భువనగిరి 1 4 0
 • జోగులాంబ గద్వాల 1 0 0
Advertisement

తాజా వార్తలు

Advertisement