Monday, May 20, 2024

నోరుజారిన సీఎం…ఏకిపారేస్తున్న మహిళలు


మహిళల వస్త్రధారణపై ఉత్తరాఖండ్ సీఎం తీరత్ సింగ్ రావత్ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పలువురు మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా, మరో ఎంపీ ప్రియాంకా చతుర్వేది, కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా ట్విట్టర్‌లోమండిపడ్డారు.‘’కిందకి చూసినపుడు గం బూట్ ఉంది. పైకి చూస్తే… ఎన్జీఓ నడుస్తున్నాయి. అయినా మోకాళ్ల దగ్గర చిరుగులే కనిపిస్తున్నాయా? సీఎం గారూ, మిమ్మల్ని చూసినపుడు పైనా, కిందా ముందూ, వెనుక మాకు కేవలం సిగ్గులేని మూర్ఖపు మనిషి కనిపిస్తున్నాడు. రాష్ట్రాన్ని నడిపిస్తున్నారా లేక మెదడు చిట్లిందా?’’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు

‘రిప్పుడ్ జీన్స్ వేసుకోవడం మన సంస్కృతిని నాశనం చేస్తుందన్నారు.. ఇది మత్తు పదార్థాల కంటే ప్రమాదకరం… సామాజిక విచ్ఛిన్నం.. మన సహజ ఆచారాలకు వ్యతిరేకంగా మహిళలు వీటిని ఖచ్చితంగా వదిలిపెట్టాలని ఉత్తరాఖండ్ సీఎం అన్నారు… ప్రియమైన బీజేపీ నేతలు.. ఇది మీ సీఎం తీరత్ సింగ్ రావత్ నైజం.. మీరు దీన్ని ఆమోదిస్తున్నారా?’’అని కాంగ్రెస్ నేత సంజయ్ ఝా విమర్శించారు.


కాగా ఉత్తరాఖండ్ సీఎం… మహిళలు చిరిగిన జీన్స్ వేసుకోవడాన్ని ఉద్దేశిస్తూ… ఇదేమి సంస్కృతి అంటూ వ్యాఖ్యానించారు. టాన్ జీన్స్‌ను ప్రస్తుత యువత విపరీతంగా ఇష్టపడుతున్నారు. అయితే.. యువతులు అలాంటి దుస్తులు వేసుకోవద్దని వ్యాఖ్యానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement