Tuesday, May 7, 2024

బీహెచ్‌ఎంఎస్‌ సీట్ల భర్తీకి 21 వరకు వెబ్‌ఆప్షన్లు

వరంగల్‌, ప్రభన్యూస్‌ ప్రతినిధి: రాష్ట్రంలోని హోమియోపతి కళాశాలల్లో బీహెచ్‌ఎంఎస్‌ కోర్సుల్లో సీట్ల భర్తీకి మొదటి విడత కౌన్సెలింగ్‌కు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం గురువారం నాడు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హులైన జాబితాను యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో పొందుపర్చారు.

అర్హులైన విద్యార్థులు ఈనెల 20వ తేది ఉదయం 8 గంటల నుండి 21వ తేది సాయంత్రం 6 గంటల వరకు వెబ్‌ఆప్షన్లు నమోదు చేసుకోవాలని యూనివర్సిటీ పేర్కొన్నది. పూర్తి సమాచారానికి యూనివర్సిటీ వెబ్‌సైట్‌ను పరిశీలించాలని యూనివర్సిటీ వర్గాలు తెలిపాయి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement