Sunday, April 2, 2023

కనీవినీ ఎరుగని రీతిలో కమలాపూర్ అభివృద్ధి.. రూ.49 కోట్లతో డెవ‌ల‌ప్‌మెంట్ వ‌ర్క్స్‌

కమలాపూర్, (ప్ర‌భ‌న్యూస్‌): కనీవినీ ఎరుగని రీతిలో కమలాపూర్ అభివృద్ధి జ‌రుగుతోంది. ప్రజలు ఊహించని విధంగా ఒకే రోజు 49 కోట్ల రూపాయ‌ల‌తో చేప‌డుతున్న‌ పలు అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ మంగళవారం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. రాష్ట్రంలో బీఆర్ ఎస్ ఆధ్వర్యంలో పార్టీలకు, ప్రాంతాలకు, రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి జరుగుతుందనడానికి ఇదే నిదర్శనం అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.

- Advertisement -
   

హనుమకొండ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం కమలాపూర్ లో రూ.49 కోట్లతో పలు అభివృద్ధి పనుల కు కేటీఆర్ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారని తెలిపారు. హెలిప్యాడ్ సహా, కేటీఆర్ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్న ఆయా అభివృద్ధి పనులను ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తదితర అధికారులతో కలిసి మంత్రి ఎర్ర‌బెల్లి ఇవ్వాల పరిశీలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement