Sunday, May 19, 2024

సీబీఐ అధికారి బండి పెద్దిరాజుకు కేంద్ర హోంమంత్రి అవార్డు..

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : న్యూఢిల్లీ కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ ) ప్రధాన కార్యాలయం సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డివిజన్ లో పనిచేస్తున్న డిప్యూటీ పోలీసు సూపరింటెండెంట్ బండి పెద్ధిరాజుకు 2019 సంవత్సరానికి ‘కేంద్ర హోంమంత్రి మెడల్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ ఇన్వెస్టిగేషన్’ పురస్కారం దక్కింది. కేంద్ర న్యాయశాఖా మంత్రి కిరణ్ రిజిజు చేతుల మీదుగా సీబీఐ డైరెక్టర్ సుబోధ్ కుమార్ జైస్వాల్ సమక్షంలో శనివారం విజ్ఞాన భవన్ లో జరిగిన ‘అల్ ఇండియా సిబిఐ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ సమావేశ కార్యక్రమం’ లో అవార్డును ప్రదానం చేసారు.

ఈ పతకం, నేరాల దర్యాప్తులో ఉన్నత వృత్తిపరమైన ప్రమాణాలను ప్రోత్సహించే లక్ష్యంతో అందజేస్తారు. పెద్ధిరాజు ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లాలోని శృoగవృక్షం (బంటుమిల్లి) గ్రామానికి చెందినవారు. అతను 1993 లో సీబీఐలో కానిస్టేబుల్‌గా చేరారు. ఇప్పటివరకు,ల్ ఆయన 150కి పైగా రివార్డ్స్ అందుకున్నారు. 2008లో ఇండియా ఉత్తమ దర్యాప్తు అధికారి గోల్డ్ మెడల్, 2017లో ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ – ఐపిఎం, 2014 & 2018 లో రెండుసార్లు అత్యుత్తమ దర్యాప్తు అధికారి అవార్డులు, 2019 లో డేటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎక్సలెన్స్ అవార్డు పొందారు. బంటుమిల్లి విద్యా ట్రస్ట్ పేరుతో తన సొంత గ్రామంలో ఎనలేని సేవలందిస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement