Thursday, May 2, 2024

Under World Don – దావూద్‌ ఇబ్రహీంపై విష ప్రయోగం – పరిస్థితి విషమం

అండర్‌ వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీంపై విషప్రయోగం చేశారన్న వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. కరాచీలో విషప్రయోగం జరిగినట్లు ప్రచారం జరుగుతోంది.

పాకిస్తాన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నివేదికల ప్రకారం.. అతని పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రిలో చేరారు. అయితే దావూద్ విషప్రయోగం చేశాడన్న వార్త ఏ రిపోర్టులోనూ ధృవీకరించలేదు. దావూద్‌ చేరిన ఆస్పత్రిలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఆసుపత్రిలోని ఆ అంతస్తులో దావూద్ ఒక్కడే రోగి. ఉన్నత ఆసుపత్రి అధికారులు, వారి సన్నిహిత కుటుంబ సభ్యులకు మాత్రమే అంతస్తులో ప్రవేశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement