Thursday, June 13, 2024

crime : హైదరాబాద్‌లో ఘోరం…అర్థ‌రాత్రి మ‌హిళ‌పై అత్యాచారం…

హైదరాబాద్‌లో ఘోరం చోటు చేసుకుంది. తార్నాకలో మహిళపై సామూహిక అత్యాచారం చేశారు. అర్ధరాత్రి సమయంలో ఓ మహిళను తార్నాకలో వదిలిపెడతానంటూ కిడ్నాప్‌ చేశారు.

మహిళను మధు అనే వ్యక్తి తీసుకెళ్లి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లాడు. అనంతరం తన నలుగురు మిత్రుల్ని ఆ నిర్మానుష్య ప్రాంతానికి పిలిపించుకున్నాడు. ఈ తరుణంలోనే.. మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఒకేసారి నలుగురు మహిళపై గ్యాంగ్ రేప్ చేశారు. మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో లాలగూడా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. మహిళపై అత్యాచారం జరిపిన ప్రశాంత్,మధుసూదన్, రోహిత్ ,తరుణ్‌ల‌ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు

Advertisement

తాజా వార్తలు

Advertisement