Monday, April 29, 2024

అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్ కు కరోనా..

గత సంవత్సరం నుంచి కరోనా ప్రపంచాన్ని కుదిపేస్తోంది రాజకీయ నాయకులు సెలబ్రిటీలు ఇలా పేద ధనిక అన్న తేడా లేకుండా అందరినీ చుట్టేస్తుంది కరోనా. కరోనా కు ఎవరు అతీతులు కారు.. తాజాగా అండర్ వరల్డ్ డాన్ ఛోటా రాజన్ కరోనా బారిన పడ్డాడు. ప్రస్తుతం ఆయన తీహార్ జైల్లో ఉన్నాడు. గత కొన్ని రోజులుగా ఛోటా రాజన్ అనారోగ్యంతో బాధపడుతున్నాడని… ఆయనకు కోవిడ్ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని జైలు అధికారులు ప్రకటించారు. సాయుధ పోలీసుల పర్యవేక్షణలో ఆయనకు చికిత్స అందిస్తున్నామని జైలు అధికారులు తెలిపారు. జైల్లో ఉన్న ఆసుపత్రి ప్రత్యేక వార్డులోనే రాజన్ కు చికిత్స అందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement