బీఆర్‌ఎస్ ప్రభుత్వ ఎనిమిదేళ్ల పాలనలో గ్రామాలు, పట్టణాల రూపురేఖలు మారాయని, సీఎం కేసీఆర్ ముందుచూపుతో పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలతో మౌళిక వసతులు, సదుపాయాలు పెరిగాయని వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. వనపర్తి మండలం చిమనగుంట పల్లిలో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం గ్రామీణా ప్రాంతాల్లో కల్పిస్తున్న సౌకర్యాలతో పట్టణాల నుంచి గ్రామాలకు తిరిగి వలసలు వస్తున్నారని వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. మిషన్ భగీరథ పథకంతో ప్రతి ఇంటికీ శుద్ధమైన తాగునీరు అందుతుందని పేర్కొన్నారు. చెరువులు, కుంటల మరమ్మతులతో సాగునీటి వసతులు, భూగర్భ జలాలు పెరిగాయని అన్నారు. వనపర్తి చుట్టూ ఉన్న చెరువుల పునరుద్దరణతో ప్రజలకు ఆహ్లాదంతో పాటు పట్టణంలో బోరుబావులు రీఛార్జ్ అయ్యాయని వెల్లడించారు. రహదారుల విస్తరణ పూర్తయితే వనపర్తి మోడల్ పట్టణంగా నిలుస్తుందని పేర్నొన్నారు.
బీఆర్‌ఎస్ పాలనలో పల్లె, పట్టణాల్లో మారిన రూపురేఖలు : మంత్రి నిరంజన్ రెడ్డి

- Advertisement -
Previous article
Next article
మరిన్ని వార్తలు
Advertisement
తాజా వార్తలు
Advertisement