Thursday, April 18, 2024

ఫిబ్ర‌వ‌రిలో అసెంబ్లీ – బ‌డ్జెట్ స‌మావేశాల‌కు క‌స‌ర‌త్తు..

అమరావతి, ఆంధ్రప్రభ: ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో బడ్జెట్‌ సమావేశాల నిర్వహణకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ మేరకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి త్వరలోనే గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను కలవనున్నట్లు తెలుస్తోంది. ఈసారి బడ్జెట్‌ సమావేశాలను దాదాపు నెల రోజులపాటు జరపాలని కూడా ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆమేరకే సభ సజావుగా నడిపిస్తూనే గడచిన మూడున్నరేళ్లుగా ప్రభుత్వం ప్రజలకు ఏం చేసిందనే దానిపై అంశాలవారీగా కూలం కుశంగా వివరించేలా ప్రభుత్వం ముందస్తు కార్యాచరణ రూపొందించుకుంటోంది. ఈసారి సమావేశాల్లో మూడు రాజధానుల బిల్లును పెట్టి తీరాలని ప్రభుత్వం అన్ని రకాలుగా సిద్ధమౌతోంది. మార్చిలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని విశాఖ కేంద్రంగా పరిపాలన ప్రారంభించాలని ఉవ్విళ్లూరుతున్న సీఎం జగన్‌ ఆమేరకు మూడు రాజధానుల బిల్లుకు తుదిమెరుగులు దిద్దుతున్నారని అంటున్నారు. దీనితోపాటు మరో 10 నుండి 15 బిల్లుల వరకూ సభ ముందుకు వచ్చే అవకాశముందని అధికారిక వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే, రాష్ట్రంలో ముందస్తు ప్రచారం ఊపందుకున్న నేపథ్యంలో సీఎం జగన్‌ నెల రోజులపాటు ఈ సమావేశాలను నిర్వహించ బోతున్నారని ప్రతిపక్షాలు పేర్కొంటున్నా యి. ఇటీవల వరుసగా చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలు కూడా ముందస్తుకు సంకేతాలిస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తమ వుతోంది. ఈ నేపథ్యంలోనే ఈసారి జరగ బోయే బడ్జెట్‌ సమావేశాలు రాష్ట్ర రాజకీయా ల్లో అత్యంత కీలకంగా మారబోతున్నాయి.

త్వరలో మంత్రివర్గం..
సమావేశాల ఆరంభానికి ముందు సీఎం జగన్‌ అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ సమావేశంలో సభలో ప్రవేశపె ట్టడానికి ఉద్దేశించిన బిల్లులపై మంత్రివర్గం చర్చించనుంది. బడ్జెట్‌ ప్రతిపాదనలను ఆమోదిస్తుంది. కొన్ని కీలక తీర్మానాలకు కూడా మంత్రివర్గం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చే అవకాశాలు లేకపోలేదు. శాసన మండలి, శాసనసభలను ఉద్దేశించి గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ చేయాల్సిన ప్రసంగ పాఠాన్ని మంత్రివర్గం ఆమోదిస్తుంది. వార్షిక బడ్జెట్‌ ప్రతిపాదనలపై మంత్రివర్గం ప్రధానంగా చర్చించనుంది. వార్షిక బడ్జెట్‌ అంచనాలను ప్రభుత్వం 2.50 లక్షల కోట్ల రూపాయలుగా నిర్ధారించే అవకాశం ఉందని సమాచారం. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు బడ్జెట్లో అధిక కేటాయింపులు ఉండొ చ్చనే అభిప్రాయాలు ఉన్నాయి. నాడు-నేడు, అమ్మఒడి, జగనన్న విద్యా దీవెన.. వంటి పథకాలను అమలు చేస్తోన్నందున విద్యా రంగానికి బడ్జెట్లో భారీగా కేటాయింపులు ఉంటాయని తెలుస్తోంది.

వికేంద్రీకరణ బిల్లుకు..
అన్నింటికీ మించి- మూడు రాజధానులను ఏర్పాటు- చేయడానికి ఉద్దేశించిన ఏపీ వికేంద్రీకరణ బిల్లును ఈ సమావేశాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోన్నట్లు- చెబుతున్నారు. దీనికి అసవర మైన ప్రక్రియను అధికారులు ఇదివరకే చేపట్టారు. ఈ సమావేశాల్లోనే ఈ బిల్లులను ఆమోదించే అవకాశాలు కనిపిస్తోన్నాయి. ఈ బిల్లు సభామోదం పొందితే.. విశాఖపట్నాన్ని కేంద్రంగా చేసుకుని వైఎస్‌ జగన్‌ పరిపాలనను సాగించడం లాంఛనప్రాయమే అవుతుంది.

31న సుప్రీంలో విచారణ..
రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ ఏపీ హైకోర్టు ఇదివరకు జారీ చేసిన ఆదేశాలపై దేశ అత్యున్నత న్యాయస్థానం స్టే విధించిన నేపథ్యంలో మూడు రాజధానుల ప్రక్రియ మరింత ఊపందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నెల 31వ తేదీన మరోసారి ఈ పిటీ-షన్లు సుప్రీంకోర్టు ముందుకు విచారణకు రానున్నాయి. రాజధాని ఎక్కడ ఉండాలనే విషయాన్ని నిర్ధారించడానికి కోర్టులు- టౌన్‌ ప్లానింగ్‌ కార్యాలయాలు కావంటూ ఇదివరకు న్యాయమూర్తులు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

- Advertisement -

మార్చితో ముగియనున్న గడప గడపకు మన ప్రభుత్వం
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహిస్తున్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం కూడా మార్చి నాటికి పూర్తి అవుతుంది. అదే నెలలో చివరి వర్క్‌ షాపు ని ర్వహిస్తానని సీఎం జగన్‌ ఇప్పటికే స్పష్టంచేశారు. ఒకవైపు గడప గడపకు కార్యక్రమం గడవు, మరోవైపు బడ్జెట్‌ సమావేశాలు మార్చిలోనే రావడంతో ముందస్తుకు వెళ్లే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు కూడా చెబుతున్నారు. ఈనేపథ్యంలో ఈసారి బడ్జెట్‌ ఈ ప్రభుత్వానికి చివరి బడ్జెట్‌ అవుతుందని, ఆక్రమంలో ప్రజలకు మరిన్ని తాయిలాలు ప్రకటించే అవకాశముందని కూడా వారు విశ్లేషిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement