Sunday, April 28, 2024

Under -19 World Cup | టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్

ద‌క్షిణాఫ్రికా గ‌డ్డ‌పై జ‌రుగుతున్న అండ‌ర్ 19 ప్ర‌పంచ‌క‌ప్ కోసం ఫైన‌ల్లో భార‌త జ‌ట్టు, ఆస్ట్రేలియా ఢీకొంటున్నాయి. విల్లోమూరే పార్క్ స్టేడియంలో జ‌రుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఏ మార్పులు లేకుండా బ‌రిలోకి దిగుతోంది. స‌మ ఉజ్జీల పోరులో టైటిల్‌ను ముద్దాడేది ఎవ‌రో మ‌రికొన్ని గంట‌ల్లో తేలిపోనుంది. డిఫెండింగ్ చాంపియ‌న్‌గా టోర్నీలో అడుగుపెట్టిన భార‌త్ లీగ్ ద‌శ‌లో ఒక్క మ్యాచ్‌లోనూ ఓడిపోలేదు. భార‌త జ‌ట్టులో ఆద‌ర్శ్ సింగ్, అర్షిన్ కుల‌కర్ణి, ముషీర్ ఖాన్, ఉద‌య్ స‌హ‌ర‌న్(కెప్టెన్), ప్రియాన్షు మోలియా, స‌చిన్ ధాస్, అర‌వెల్లి అవినాష్(వికెట్ కీప‌ర్), మురుగ‌న్ అభిషేక్, రాజ్ లింబానీ, న‌మ‌న్ తివారీ, సౌమీ పాండే ఉన్నారు. అదేవిధంగా ఆస్ట్రేలియా జ‌ట్టులో హ్య‌రీ డిక్స‌న్, సామ్ కొంస్ట‌స్, హుగ్ వీబ్జెన్(కెప్టెన్), హ‌ర్జాస్ సింగ్, రియాన్ హిక్స్(వికెట్ కీప‌ర్), ఒలివ‌ర్ పీకే, ర‌ఫ్ మ‌క్‌మిల్లాన్, చార్లీ అండ‌ర్స‌న్, టామ్ స్ట్రేక‌ర్, మ‌హ్లి బియ‌ర్డ్‌మ‌న్, క‌ల్ల‌మ్ విడియర్ లు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement