Saturday, May 4, 2024

అండర్‌19 టీ20 నేషనల్‌ క్రికెట్‌ టోర్నీ.. విజేత ఏపీ జట్టు

ఇండియన్‌ డీఫ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (ఐడీసీఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్‌-19 టీ20 నేషనల్‌ క్రికెట్‌ చాంపియన్‌షిప్‌ టోర్నమెంట్‌ విజేతగా ఆంధ్రప్రదేశ్‌ బధిరుల జట్టు నిలిచింది. ఫైనల్‌ మ్యాచ్‌లో గుజరాత్‌ బధిరుల జట్టుపై 5 వికెట్ల తేడాతో ఏపీ జట్టు విజయం సాధించింది. టాస్‌ గెలిచిన ఆంధ్రప్రదేశ్‌ జట్టు తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకుంది. ఏపీ బౌలర్లు అద్భుతంగా రాణించి, గుజరాత్‌ను 97 పరుగులకే కట్టడి చేశారు. అనంతరం బరిలోకి దిగిన ఏపీ జట్టు 5 వికెట్లు కోల్పోయి 98 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది.

దీంతో అండర్‌-19 టీ20 నేషనల్‌ క్రికెట్‌ చాంపియన్‌షిప్‌ టోర్నమెంట్‌ టైటిల్‌ను చేజిక్కించుకుంది. టోర్నమెంట్‌ బ్యాట్స్‌మెన్‌గా ముస్తకిమ్‌ కాజి, మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా పి.విజయ్‌ భాస్కర్‌ అందుకున్నారు. ఇండియన్‌ డీఫ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ సుమిత్‌ జైన్‌ మాట్లాడుతూ… ఇండియన్‌ డీఫ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌- కెఎఫ్‌సీ సంయుక్త భాగస్వామ్యంతో తొలిసారి బధిరుల టీ20 క్రికెట్‌ టోర్నమెంట్‌ను విజయవంతంగా నిర్వహించాం. తొలి టోర్నీ విజేతగా ఆంధ్రప్రదేశ్‌ జట్టు నిలిచింది. ఇది మంచి శుభపరిణామం. రానున్న రోజుల్లో మరిన్ని టోర్నమెంట్లు నిర్వహిస్తాం” అని వ్యాఖ్యానించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement