Wednesday, May 1, 2024

అండర్‌-17 మహిళల ఆసియా కప్‌.. కిర్గిజ్‌స్థాన్‌తో భారత్‌ తొలిపోరు

2024లో జరిగే ఎఎఫ్‌సి – అండర్‌ 17 మహిళల ఆసియా కప్‌ కోసం క్వాలిఫయర్స్‌ మ్యాచ్‌లు కిర్గిస్తాన్‌ వేదికగా వచ్చేవారం నుంచి జరగనున్నాయి. ఈ పోటీల్లో ఏప్రిల్‌ 26న భారత్‌ పోరాటం ఆతిథ్య జట్టుతో ఆరంభం అవుతుంది. క్వాలిఫయర్స్‌లో ప్రిలిమినరీ గ్రూప్‌లో మయన్మార్‌, కర్గిస్తాన్‌తో కలిసి గ్రూప్‌ ఎఫ్‌లో ఉంది. ఏప్రిల్‌ 28న గ్రూప్‌లో భారత్‌ తన రెండో మ్యాచ్‌లో మయన్మార్‌తో తలపడనుంది.

గ్రూప్‌ ఎఫ్‌ పోటీలు బిష్‌కెక్‌లోని చారిత్రాత్మక 82 ఏళ్ల డోలెన్‌ ఒముర్జాకోవ్‌ స్టేడియంలో ఆతిథ్య కిర్గిజ్‌ రిపబ్లిక్‌ – మయన్మార్‌ పోటీతో ప్రారంభం అవుతాయని ఆసియా ఫుట్‌బాల్‌ కాన్ఫెడరేషన్‌ (ఎఎఫ్‌సి) గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. అండర్‌ 17 మహిళల ఆసియా కప్‌కు కేవలం ఒక సంవత్సరం మాత్రమే సమయం ఉన్నందున, ఆసియాలోని 24 జట్లు రేపటి నుంచి క్వాలిఫైయింగ్‌ ప్రయాణాన్ని ప్రారంభించనున్నాయి. క్వాలిఫయర్స్‌లో థాయ్‌లాండ్‌, మంగోలియా, వియత్నాం, సింగపూర్‌, తజికిస్తాన్‌, కిర్గిజిస్తాన్‌, గువామ్‌, జోర్డాన్‌ కొన్ని అగ్రశ్రేణి జట్లుగా ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement