Friday, May 10, 2024

రష్యానుదెబ్బకు దెబ్బ తీశాం.. 1000 ట్యాంకులు పేల్చేశాం..

రష్యా దాడులు ముమ్మరం చేసినప్పటికీ గట్టిగానే తిప్పికొడుతున్నామని, వారిని దెబ్బకు దెబ్బ తీశామని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రకటించారు. ఉక్రెయిన్‌ పోర్ట్‌ సిటీ ఒడెశాపై ఆదివారం క్షిపణుల వర్షం కురిపించిన రష్యా మరికొన్ని నగరాల్లోనూ విధంసం సృష్టించింది. రష్యా దాడిలో ఆ నగరంలోని విమానాశ్రయంలో రన్‌వే పూర్తిగా ధ్వంసమైంది. 17 సైనిక స్థావరాలను ధ్వంసం చేశామని, 200మంది ఉక్రెయిన్‌ సైనికులు ప్రాణాలు కోల్పోయారని రష్యా ప్రకటించింది. అయితే, రష్యా దాడులను ముమ్మరం చేసినప్పటికీ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని జెలెన్‌స్కీ ప్రకటించారు. తమపై రష్యా యుద్ధానికి దిగి 67 రోజులు పూర్తయిందని, ఇప్పటివరకు ఆ దేశానికి చెందిన 1000 ట్యాంకులు, 200 యుద్ధవిమానాలు, కనీసం 2500 సాయుధ వాహనాలు, 23వేలమందికి పైగా సైనికుల ప్రాణాలు తీశామని వెల్లడించారు. గతంలో రష్యా సాధీనంలోకి వెళ్లిన అనేక పట్టణాల్లో మళ్లిd ఉక్రెయిన్‌ స్థానిక ప్రభుత్వాలు పట్టు సాధించాయని ఆయన ప్రకటించారు. కాగా ఉక్రెయిన్‌పై యుద్ధం నేపథ్యంలో భారీస్థాయిలో ప్రాణ నష్టాన్ని చవిచూశామని, భారీ సంఖ్యలో సైనికులు, సైనికాధికారులను కోల్పోవడం పెద్ద విషాదమని క్రెవ్లిున్‌ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్‌ అంగీకరించారు. ఓ వార్తాసంస్థకు ఇచ్చిన ముఖాముఖి కార్యక్రమలో ఆయన మాట్లాడుతూ రష్యాకు ఎదురుదెబ్బలు తగిలినమాట వాస్తవమేనన్నారు.

కాగా తీవ్ర ప్రతిఘటన ఎదురవుతున్న నేపథ్యంలో బెలారస్‌ సరిహద్దుల నుంచి రష్యా విరుచుకుపడే ప్రమాదం ముంచుకొస్తోందని, ఇప్పటికే అదనపు బలగాలను, ఆయుధాలను ఆ దేశం సరిహద్దుల్లోకి రష్యా తరలించిందని ఉక్రెయిన్‌ సైనికాధికారులు తెలిపారు. ఖార్కీవ్‌ పరిథిలోని స్లోబొఝాన్‌స్క్‌ ప్రాంతంలో కొత్తగా సాయుధ బలగాలను తరలించింది. ఇప్పటికే పట్టు సాధించిన డోనెట్‌స్క్‌, లుషాంక్‌లనుంచి 300 సాయుధ విభాగాలను, వెయ్యిమంది సైనికులను, బక్‌ -ఎం2 రక్షణ వ్యవస్థను ఖార్కీవ్‌ సరిహద్దుల్లోని నాలుగు వ్యూహాత్మక ప్రాంతాల్లో రష్యా మోహరించిందని ఉక్రెయిన్‌ ప్రకటించింది. మరోవైపు రష్యా గుప్పిట్లోకి వెళ్లిపోయిన మరియుపోల్‌ ఉక్కునగరంలో చిక్కుకుపోయిన వేలాదిమందిలో కొందరు వృద్ధులు, చిన్నారులను కొద్ది సంఖ్యలో సురక్షిత ప్రాంతాలకు తరలించగలిగారు. మరోవైపు డాన్‌బాస్‌కు సమీపంలోని రష్యా భూభాగంలో రెండు చమురు డిపోలపై ఉక్రెయిన్‌ బాంబు దాడులు చేసింది. అక్కడ చమురు నిల్వ ఉన్న ట్యాంకులు పేలిపోయి అగ్నికీలలు చుట్టూ వ్యాపించాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement