Thursday, May 2, 2024

రేపే ఉగ్రం టీజ‌ర్ రిలీజ్

కామెడీ సినిమాల‌తో పాపుల‌ర్ అయిన హీరో అల్ల‌రి న‌రేష్‌..ఈ మ‌ధ్య కాలంలో సీరియ‌స్ రోల్స్ తో దుమ్ము రేపుతున్నారు. నాంది చిత్రంతో విజయం సాధించిన తర్వాత దర్శకుడు విజయ్ కనకమేడలతో మరోసారి జతకట్టారు. వీరి కాంబినేష‌న్ లో ఉగ్రం అనే చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా మలయాళ నటి మర్నా నటించనుంది.షైన్ స్క్రీన్స్‌పై సాహు గారపాటి .. హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మించారు. మే 5, 2023న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఉగ్రం మేకర్స్ ఈ చిత్రం గురించి అప్ డేట్ ఇచ్చారు. ఫిబ్ర‌వ‌రి 22 అంటే రేపు ఉదయం 11:34 గంటలకు సినిమా టీజర్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేర‌కు పోస్టర్‌ను విడుదల చేశారు. స్క్రిప్ట్ మరియు డైలాగ్స్ తూమ్ వెంకట్ .. అబ్బూరి రవి రాశారు, శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement