Monday, April 29, 2024

ఉదయ్‌పూర్‌ డిక్లరేషన్‌.. రాష్ట్ర కాంగ్రెస్‌ నేతల్లో అలజడి..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : కాంగ్రెస్‌ పార్టీ ఉదయ్‌పూర్‌ డిక్లరేషన్‌ రాష్ట్ర కాంగ్రెస్‌ నేతల్లో ఆందోళన కలిగిస్తున్నది. ఒకే కటుంబానికి.. ఒకే టికెట్‌ అనే నిర్ణయం కొంత మంది సీనియర్లలో అలజడిరేగుతుంది. పార్టీ పదవులు, ఎన్నికల్లో పోటి చేసే వారు.. కనీసం పార్టీ కోసం ఐదేళ్లు పని చేయాలనే నిబందన.. కొత్తగా పార్టీలో చేరలానుకునే వారికి కూడా ప్రతిబంధకంగా మారే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ప్రధానంగా ఒకే కుటుంబానికి.. ఒకే టికెట్‌ నిర్ణయంతో కొందరు నాయకుల ఆశలు గల్లంతయ్యే అవకాశం ఉంది. రాష్ట్ర కాంగ్రెస్‌లోని కొందరు కీలక నాయకుల కుటుంబాల నుంచే భార్య, భర్త, అన్నదమ్ములు, తండ్రీకొడుకులు వివిధ నియోజక వర్గాల నుంచి పోటీ చేస్తుండగా.. వచ్చే ఎన్నికల్లో మరికొందరు నాయకులు తమతో పాటు వారి వారసులను కూడా రాజకీయాల్లోకి దింపే ప్రయత్నంలో ఉన్నారు. అయితే ఉదయ్‌పూర్‌ డిక్లరేషన్‌తో వారసత్వ రాజకీయాలకు చెక్‌పెట్టినట్లుగానే భావిస్తున్నారు. ఉదయ్‌పూర్‌ డిక్లరేషన్‌ నిర్ణయం కొందరు స్వాగతిస్తుండగా.. మరి కొందరికి రుచించడం లేదు. ఈ నిర్ణయంతో కొన్ని నియోజర వర్గాల్లో ఇబ్బందులు వస్తాయనే వాదన కాంగ్రెస్‌ వర్గాల నుంచి వినిపిస్తోంది. రాజకీయాల్లో కొత్తగా వచ్చేవారికి మాత్రమే వర్తిస్తుందా..? లేక ఇంతకు ముందు రాజకీయాల్లో ఉన్న వారికి కూడా వర్తిస్తుందా..? అనేది స్పష్టత రావాల్సి ఉందని గాంధీభవన్‌ వర్గాలు చెబుతున్నాయి.

ప్రధానంగా టీపీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నల్లగొండ లోక్‌సభ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఉత్తమ్‌ సతీమణి పద్మావతిరెడ్డి కోదాడ నుంచి గతంలో ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించగా.. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడా హుజూర్‌నగర్‌ నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. 2018లో జరిగిన అసెంబ్లి ఎన్నికల్లో పద్మావతి కోదాడ నుంచి ఓటమి చెందగా, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హుజూర్‌నగర్‌ నుంచి విజయం సాధించారు. ఆ తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో నల్లగొండ నుంచి ఉత్తమ్‌ ఎంపీగా విజయం సాధించడంతో.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో హుజూర్‌నగర్‌కు ఉప ఎన్నిక అనివార్యమైంది. ఉప ఎన్నికలో పద్మావతిరెడ్డిని కాంగ్రెస్‌ నుంచి బరిలోకి దింపగా ఓటమి చెందారు. అయితే వచ్చే అసెంబ్లి ఎన్నికల్లో హుజూర్‌నగర్‌ అసెంబ్లికి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోదాడ అసెంబ్లి నుంచి పద్మావతిరెడ్డిలు పోటి చేసేందుకు సమాయత్తం అవుతున్నారు.

కాగా ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచే కోమటిరెడ్డి బ్రదర్స్‌ కూడా రాజకీయాల్లో కొనసాగుతున్నారు. భువనగిరి ఎంపీగా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యేగా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గతంలో ఎంపీగా రాజగోపాల్‌రెడ్డి, ఎమ్మెల్యేగా వెంకట్‌రెడ్డిలు ప్రాతినిధ్యం వహించారు. 2014 ఎంపీ ఎన్నికల్లో రాజగోపాల్‌రెడ్డి ఓటమి చెందారు. ఆ తర్వాత నల్లగొండ జిల్లా స్థానిక సంస్థల స్థానం ఎమ్మెల్సీగా విజయం సాధించారు. తిరిగి 2018లో జరిగిన అసెంబ్లి ఎన్నికల్లో మునుగోడు నుంచి రాజగోపాల్‌రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎమ్మెల్సీ పదవికీ రాజీనామా చేయగా ఏర్పడిన ఉప ఎన్నికకు ఆయన సతీమణిని పోటి చేయించగా ఓటమి చెందారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఆయన సోదరుడు మల్లు రవిలు కూడా దశాబ్దాలుగా రాజకీయాల్లో కొనసాగుతున్నారు. భట్టి విక్రమార్క ఖమ్మం జిల్లా మధిర నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తుండగా, మల్లు రవి నాగర్‌కర్నూల్‌ నుంచి గతంలో ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. గత ఎన్నికల్లో నాగర్‌ కర్నూల్‌ లోక్‌సభ నుంచి ఎంపీగా, జడ్చర్ల అసెంబ్లికి ఎమ్మెల్యేగా పోటి చేసి ఓటమి చెందారు. వచ్చే ఎన్నికల్లో మళ్లి పోటి చేసేందుకు అన్నదమ్ములిద్దరు సమాయత్తమవుతున్నారు. టీ పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌ యాదవ్‌ సికింద్రాబాద్‌ నుంచి పోటి చేయగా.. ఆయన తనయుడి అనిల్‌కుమార్‌ యాదవ్‌ ముషిరాబాద్‌ నుంచి ఎమ్మెల్యేగా పోటి చేసి ఓటమి చెందారు. తిరిగి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచనతో ఉన్నారు. ఇప్పుడు పార్టీ అధిష్టానం వీరిలో ఎవరికి అవకాశం ఇస్తుందనే చర్చ సాగుతోంది.

వారసులను బరిలో దింపేందుకు సీనియర్ల యత్నాలు..

ఇదిలా ఉండగా కొంత మంది సీనియర్‌ నేతలు తమ వారసులను బరిలో దింపేందుకు ఇప్పటి నుంచే ప్లాన్‌ చేసుకుంటున్నారు. మాజీ మంత్రి జానారెడ్డి నాగార్జున సాగర్‌ నుంచి పోటి చేస్తూనే.. ఆయన తనయుడు రఘువీర్‌రెడ్డిని మిర్యాలగూడ నుంచి బరిలోకి దింపాలనే ఆలోచనతో ఉన్నారు. మాజీ మంత్రి కొండా సురేఖతో పాటు అమె కూతురిని కూడా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయించే ఆలోచనతో ఉన్నారు. పరకాలతో పాటు వరంగల్‌ తూర్పు నియోజక నియోజ…

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement