Friday, March 29, 2024

మూవీ ల‌వర్స్ కు శుభ‌వార్త‌.. ఈ నెల‌ ఓటీటీలో ఫుల్ కంటెంట్..

ప్రస్తుతం వేసవి వెకేషన్ ఎంజాయ్ చేసేందుకు ఓటీటీ ప్రేమికులకు శుభవార్త. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ‌ప్లస్ హాట్‌స్టార్, జీ5, ఆహా వంటి ఓటీటీల్లో టీవీషోలతో పాటు సూపర్ హిట్ సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమ్ అవుతున్నాయి. ఈ నెలలో వివిధ ఓటీటీల్లో విడుదల కానున్న సినిమాలు పరిశీలిద్దాం..

ఇటీవల విడుదలైన ది కశ్మీర్ ఫైల్స్ సినిమా మే 13వ తేదీన హిందీ, తమిళ, తెలుగు, కన్నడతో సహా ఇతర భారతీయ భాషళ్లో విడుదల కానుంది. మోడర్న లవ్ ముంబాయి వెబ్‌సిరీస్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతోంది. ఇక సూపర్ డూపర్ హిట్ హలీవుడ్ సీక్వెల్ మూవీ మ్యాట్రిక్స్ 4..అమెజాన్‌లో స్ట్రీమ్ అవుతోంది. ఇందులో బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా నటిస్తోంది. ఇక ఇటీవల విడుదలై బాక్సాఫీసు రికార్డులతో సంచలనం రేపుతున్న రాజమౌళి సినిమా ఆర్ఆర్ఆర్ కూడా నెట్‌ఫ్లిక్స్, జీ5లలో స్ట్రీమింగ్ కానుంది. తళపతి విజయ్, పూజా హెగ్డే నటించిన బీస్ట్ సినిమా ఏప్రిల్ 13న థియేటర్లలో విడుదలైంది. ఇప్పుడు నెట్‌‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతోంది. ఈనెల 20న అమెజాన్‌ ప్రైమ్ లో ఆచార్య విడుద‌ల కానుంది. ఇక మరో బాలీవుడ్ మూవీ ఆదా ఇష్క్ వూట్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తల్లీకూతుర్లు ఒకే వ్యక్తితో ప్రేమలో పడటమనే విభిన్నమైన రొమాంటిక్ సినిమా ఇది. ఇక మమ్ముట్టి, పార్వతి తిరువోతు నటించిన మళయాళం సినిమా పుఝు సోనీలివ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement