Saturday, May 4, 2024

Poonam Pandey: పాండే మృతిలో ట్విస్ట్.. బతికే ఉన్నానంటూ స్టేట్ మెంట్

బాలీవుడ్ నటి పూనమ్ పాండే చనిపోయిందనేది నిన్నటి సంచలన వార్త. దీని మీద మీడియాలో, సోషల్ మీడియాలో తెగ హైలట్ చేశారు. వరుస పెట్టి కథనాలు వచ్చాయి. బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా చాలా మంది సంతాపం ప్రకటించారు. మొత్తానికి గోలగోల అయింది. అయితే ఈరోజు అదంతా ఒట్టిదే అని చెబుతున్నారు. పబ్లిసిటీ కోసమే అంతా చేసిందని చెబుతున్నారు. నిన్న వ్యక్తమయిన అనుమానాలు ఈరోజు నిజమయ్యాయి. దానికి సంబంధించిన వార్తలు ఒక్కొక్కటే బయటకు వస్తున్నాయి.

పూనమ్ పాండే ఒక మోడల్. ఏవో కొన్ని బాలీవుడ్ సినిమాల్లో కూడా నటించింది. ఈమె ఒక పోర్న్ స్టార్ కూడా. అయితే వీటన్నింటికన్నా ఈమె ఎక్కువగా పబ్లిసిటీ స్టంట్స్‌తో ఫేమస్ అయింది. భర్త షూట్ చేస్తుంటే పోర్న్ వీడియోల్లో పాల్గొనడం…మళ్ళీ ఆ భర్తే తనని హింసిస్తున్నాడంటూ కేసు పెట్టడం…2011 వరల్డ్‌ కప్ గెలిస్తే నగ్నంగా తిరుగుతా అంటూ అనౌన్స్ చేయడం లాంటి వాటితో ఫుల్ పైరే పంపాదించుకుంది. వార్తల్లో బాగా వైరల్ అయింది. అదిగో ఆ అలవాటే ఇప్పుడు కూడా ప్రదర్శించింది. కొన్ని రోజులుగా కామ్‌గా ఉంటున్న పూనమ్ పాండే మళ్ళీ టాక్ ఆఫ్ న్యూస్ అవ్వాలనుకుంది. దాని కోసం ఏకంగా చనిపోయినట్లు నటించి, నమ్మించింది.

పూనమ్ పాండే చనిపోయింది అని చెప్పిన రోజుకు రెండు రోజుల ముందు కూడా షూటింగ్‌లో పాల్గొంది. అయోధ్య రామమందిర్ ప్రారంభోత్సవం రోజు కూడా చాలా హుషారుగా కనిపిస్తూ వీడియో పోస్ట్ చేసింది. అక్కడే చాలా మందికి డౌట్ వచ్చేసింది. దాంతో సర్వైకల్ క్యాన్సర్ వచ్చిన పూనమ్ అలా ఎలా సడెన్‌గా చనిపోయింది ? అంటూ అందరికీ డౌట్ వచ్చింది. జనవరి 29న పూనమ్ పాండే చివరి సారిగా అందరికీ కనిపించింది. తరువాత నుంచి ఆమె అజ్ఞాతంలోకి వెళ్ళిపోయింది. మళ్ళీ నాలుగు రోజుల తర్వాత నిన్న 2వ తేదీన ఆమె చనిపోయిందంటూ అనౌన్స్ చేశారు. అయితే ఈ విషయం ఆమె తల్లిదండ్రులకు కూడా తెలియదు. అప్పటి నుంచి పూనమ్ వారికి కూడా కనిపించలేదు, కాంటాక్ట్‌లో కూడా లేదు. నిన్నటి మరణ వార్తతో పేరెంట్స్ ఆందోళన చెందారు.

- Advertisement -

దాంతో వారు తమ కూతురు తప్పిపోయింది అంటూ పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఇప్పుడు ఇదే పూనమ్ పాండే చనిపోలేదు అనడానికి పెద్ద రీజన్ అయింది. కూతురు చనిపోతే కన్న తల్లిదండ్రలకు తెలియకుండా ఎలా ఉంటుంది. క్యాన్సర్ గురించి కూడా వారికి తెలియదా అని అడుగుతున్నారు. చివరకు ఆమె అందరికీ బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. తాను గర్భాశయ క్యాన్సర్ తో చనిపోయినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని.. తాను బతికే ఉన్న అంటూ తాజాగా ఓ వీడియో విడుదల చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement