Friday, May 3, 2024

ఈ-స్కూటర్‌ ఉత్పత్తి పెంచిన టీవీఎస్‌.. నవంబర్‌లో 10,056 ఐ క్యూబ్‌ అమ్మకాలు

టీవీఎస్‌ మోటార్‌ కంపెనీ తన విద్యుత్‌ స్కూటర్‌ ఐ క్యూబ్‌ ఉత్పత్తిని గణనీయంగా పెంచాలని నిర్ణయించింది. ప్రస్తుతం కంపెనీ నెలకు 10 వేల ఈ-స్కూటర్స్‌ను ఉత్పత్తి చేస్తోంది. దీన్ని 2023 మార్చి చివరినాటికి 25 వేలకు పెంచనున్నట్లు కంపెనీ సీఈఓ, డైరెక్టర్‌ కేఎన్‌ రాధాకృష్ణన్‌ తెలిపారు. టీవీఎస్‌ ఐ క్యూబ్‌ అమ్మకాలు నెలనెలా పెరుగుతున్నాయి. కంపెనీ ఇప్పటికే ఇ-కామర్స్‌ సంస్థలైన అమెజాన్‌, సిగ్గ్వి వంటి సంస్థలతో ఐక్యూబ్‌ అమ్మకాలపై ఒప్పందం చేసుకుంది. ఈ రెండు సంస్థలు ఉద్యోగులకు ఐ క్యూబ్‌ స్కూటర్స్‌ను ఇవ్వనున్నాయి. ఐ క్యూబ్‌ మార్కెట్‌లోకి వచ్చిన తరువాత ఈ సంవత్సరం నవంబర్‌లో రికార్డ్‌ స్థాయిలో 10,056 యూనిట్లను విక్రయించింది.

మార్కెట్‌లో కస్టమర్లు ఇ-స్కూటర్స్‌ కొనుగోళ్ల పట్ల ఆసక్తి చూపిస్తున్నందునే అమ్మకాలు గణనీయంగా పెరుగుతున్నాయని ఆయన చెప్పారు. ప్రస్తుతం ఇ-స్కూటర్స్‌ మార్కెట్‌లో టీవీఎస్‌ కంపెనీకి నవంబర్‌ అమ్మకాలతో 10.6 శాతం వాటా కలిగి ఉంది. అమ్మకాల రీత్యా ఓలా, అంపేర్‌, ఒకినోవా, హీరో ఎలక్ట్రిక్‌ తరువాత 5వ స్థానంలో ఉంది. ఐ క్యూబ్‌ ఒక్కటే స్కూటర్‌ను కంపెనీ విడుదల చేసింది. కస్టమర్లకు మరిన్న మోడల్స్‌ అందించనున్నామని ఆయన తెలిపారు. టీవీఎస్‌ డీలర్‌ నెట్‌వర్క్‌ 88 నగరాల్లో ఉంది. త్వరలోనే ఇది వందకు చేరుతుందని కంపెనీ తెలింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement